పుంగనూరు ఎంపీడీవోగా నారాయణ
పుంగనూరుముచ్చట్లు:
221
మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నారాయణ మంగళవారం పదవి బాధ్యతలు చేపట్టారు. కలకడ ఈవోపీఆర్‌డిగా ఉన్న నారాయణ బదిలీపై పుంగనూరు ఈవోపీఆర్‌డిగా వచ్చారు. ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌చార్జ్ ఎంపీడీవోగా ఉన్న రాజేశ్వరి నుంచి బాధ్యతలు స్వీకరించారు. మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ మేరకు మర్యాదపూర్వకంగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డిని ఆయన కలసి పలు విషయాలపై చర్చించారు.

Tags; Narayana as Punganur MPDO
