పవన్ పై మండిపడ్డ మంత్రి నారాయణ

date:15/03/2018
అమరావతి ముచ్చట్లు:
ఏపీ మంత్రి నారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. రాష్ట్రం కోసం బీజేపీ తో పోరాడుతున్నాం. ప్రత్యేక హోదా కోసం కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ని అవినీతి పార్టీ అని పవన్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఒకప్పుడు అవినీతిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని సీఎం 13వ స్థానానికి తీసుకొచ్చారు. అసలు పవన్ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. ఇసుక,ఎర్ర చందనం విషయంలో కఠినంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే లంతా అవినీతిపరులేనా. దేశం మొత్తం మీద బీజేపీ పై వ్యతిరేక పవనాలున్నాయని మంత్రి అన్నారు. పవన్ మాటలతో రాష్ట్ర ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. మన కళ్ళు పొడిచే దుర్మార్గం చేస్తున్నాడు. రాజకీయం వేరు…సినిమా ప్రపంచం వేరని అయన అన్నారు. పవన్ సభలో సినిమా స్క్రిప్ట్ లా ఎవరో రాసింది చదివి వినిపించాడని విమర్శించారు. పనిలో పనిగా మాజీ ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై కూడా విమర్శలు గుప్పించారు. నాడు ప్రజారాజ్యం పేరుతో చిరంజీవి కాపులను తాకట్టు పెట్టారనీ, ఇప్పుడు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో బీజేపీ చేతిలో పావులా మారారని నారాయణ విమర్శించారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన చిరంజీవి ప్రజారాజ్యం కారణంగా కాపులు 20 ఏళ్లు వెనక్కు పోయారని, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ చేతిలో పావుగా మారి రాష్ట్రప్రయోజనాలకు గండి కొడుతున్నారని నారాయణ విమర్శించారు.
Tags: Narayana, who is paved over Pawan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *