Narayanavanam Single Window President meets Minister Peddireddy!

మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన నారాయణవనం సింగిల్ విండో ప్రెసిడెంట్!

-స్వగృహానికి వెళ్లి ఆత్మీయ పలకరింపు

Date:29/10/2020

సత్యవేడు ముచ్చట్లు:

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనయుడు నారాయణవనం సింగిల్ విండో ప్రెసిడెంట్ కోనేటి సుమన్ కుమార్ గురువారం రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నీ తిరుపతి లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయంగా మాట్లాడారు.
నారాయణవనంలో తహశీల్దార్ కార్యాలయానికి భవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే కార్యాలయాన్ని కొనసాగిస్తున్నామని త్వరితగతిన పక్క భవనానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు సుమన్ విజ్ఞప్తి పై స్పందించిన మంత్రి త్వరలోనే కార్యాలయం నిర్మాణానికి సంబంధించి నిధులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు అందుతాయి అని ప్రకటించారు, ఎమ్మెల్యే ఆరోగ్యం కాస్త కుదుట పడిన ఇంకా నీరసంగానే ఉందని ఇలాంటి తరుణంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవలసి ఉంటుందని ఎమ్మెల్యే ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకోవాలని మంత్రి సుమన్ కి సూచించారు. సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి తాను ఎల్లవేళలా ముందుంటానని మంత్రి
స్పష్టం చేశారు , అంతకుమునుపు మంత్రి ఇంటికెళ్లిన కోనేటి సుమన్ ను మంత్రి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు.

ఐఎస్బీ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గౌతం రెడ్డి

Tags: Narayanavanam Single Window President meets Minister Peddireddy!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *