నరేంద్ర ఝా కన్నుమూత

Date:14/03/2018
ముంబై ముచ్చట్లు:
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలో బాజీరావుగా క్రూరత్వాన్ని పండించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లా వాడాలో ఉన్న తన ఫామ్ హౌస్‌లో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో నరేంద్ర అక్కడే కుప్పకూలిపోయినట్లు సన్నిహితులు వెల్లడించారు. ఆయనకి గుండెపోటు రావడం ఇది మూడోసారని తెలిపారు.బిహార్‌లోని మధుబనిలో జన్మించిన నరేంద్ర ఝా.. టీవీ, సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో ‘హైదర్’, ‘కాబిల్’, ‘మొహెంజోదారో’, ‘రయీస్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన నరేంద్ర.. తెలుగులో ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘లెజెండ్’ చిత్రాలో విలన్ పాత్రల్లో నటించారు. సుమారు 20 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాలోనూ నటిస్తున్నారు. అలాగే మరో హిందీ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇవి విడుదల కావాల్సి ఉన్నాయి.కాగా, నరేంద్ర ఝా మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుతూ సోనూసూద్, హన్సల్ మెహతా, ఏక్తా కపూర్ తదితరులు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.
Tags: Narendra Jha is dead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *