ఏ ప్రధాని చేయని అభివృద్ధిని  నరేంద్ర మోడీ చేసి చూపిస్తున్నారు

కామారెడ్డి  ముచ్చట్లు:

భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని చేయని అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపిస్తున్నారని జిల్లా ఓబిసి అధ్యక్షులు మహారాజుల మురళి అన్నారు. ఓబిసి జాతీయ అధ్యక్షులు డాక్టర్. లక్ష్మణ్ ఆదేశాలనుసారం శుక్రవారం కామారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో ఓబిసి మోర్చా తరపున మన ప్రధాని నరేంద్రమోడీ కి పాలాభిషేకం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా ఓ బి సి అధ్యక్షులు మహారాజుల మురళి మాట్లాడుతూ,  భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని చేయని అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు చేసి చూపిస్తున్నారని,  ఓబీసీలకు 27 యూనియన్ మినిస్ట్రీ లను ఇవ్వడం బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పీఠం వేశరన్నారు. పేదల పక్షపాతి మోడీ అని భారత దేశ అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీలం చిన్న రాజులు,  ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడెం శ్రీకాంత్,  బండారి సాయిరాం గౌడ్,  జిల్లా నాయకులు అవధూత నరేందర్,  ఓబిసి జనరల్ సెక్రటరీ శంకర్ గౌడ్,  లక్ష్మీనారాయణ,  పాటిమీద గంగన్న,  ఆర్కే గౌడ్,  ఉదయ్,  దత్తు రాం , మొక్క సురేష్,సత్యనారాయణ,  చైతన్య శ్రీనివాస్, తది తరులు ,  నాయకులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags; Narendra Modi is showing development that no Prime Minister has done

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *