రాజకీయ స్కెచ్‌లు వేయటంలో ప్రత్యేక వ్యక్తి  నరేంద్రమోదీ

Narendra Modi specializing in sketches

Narendra Modi specializing in sketches

Date:10/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ రకరకాల స్కెచ్‌లు వేయటం.. వాటిని అమలు చేయటం ఎప్పుడూ జరిగే పరిణామమే. కానీ ఇలాంటి స్కెచ్‌లు వేయటంలో ప్రత్యేక వ్యక్తి  దేశ ప్రధాని నరేంద్రమోదీ. ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా తాననుకున్న పనికానిచ్చి ప్రత్యర్థి రాజకీయ పార్టీలను అయోమయంలో నెట్టేయటంలో ఆయనను మించిన శక్తి లేదు. అంతకుముందు.. రాత్రికి రాత్రి నోట్ల రద్దు అనే పెద్ద నిర్ణయం తీసుకొని ఇతర రాజకీయ పార్టీలకు, నల్ల ధన కుబేరులకు కాసేపు ఊపిరాడకుండా చేశారు మోడీ. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు 323–3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల వ్యవధిలో రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి దశలో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది.ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సున్నితమైన రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలు సహకరించడంతో ఈ బిల్లు పార్లమెంట్‌ అడ్డంకిని అధిగమించింది. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు అంతిమంగా అనుకూలంగానే ఓటేశాయి. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. బిల్లు రాజ్యాంగబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలు..ఈ చట్టం అమలులో సంక్లిష్టతలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జనసంఖ్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించకుండానే కేంద్రం హడావుడిగా ఈ తతంగాన్ని ముగించిందని ఎండగట్టాయిఅయితే ఆ తర్వాత నోట్ల రద్దు.. దాని వల్ల దేశానికి ఒరిగిందేమిటనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా! అత్యంత రహస్యంగా ఎవరికీ తెలియకుండా.. ఏ ఒక్క రోజూ ఎక్కడా సూచనప్రాయంగా కూడా అలాంటి సంగతి బయటకు పొక్కకుండా మోదీ ఒక్కసారిగా ఆ ప్రకటన చేయటం అప్పుడు సంచలనంగా మారింది.
ఇక మళ్లీ ఇప్పుడు.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించే వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీకి గానీ, ఇతర నేతలకు గానీ ఊహకు కూడా అందలేదు. ఈబీసీ లోని పేదలకు 10 శాతం కోటా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఎస్పీ, ఆప్ వంటి పార్టీలన్నీ మద్దతివ్వక తప్పలేదు. కాదంటే ఆ వర్గాల ఓట్లు దూరం చేసుకున్నట్లే. ఔనంటే మోదీ ఓట్ల కోసం వేసిన ఈ ఎత్తుగడకు మద్దతు పలికి ఆయనకు మేలు చేసినట్లే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలన్నీ ఇరకాటంలో పడ్డాయి. దేశంలోని ఇతర పార్టీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది. చివరకు లోక్ సభలో ఈ బిల్లుకు మోదీకి బద్ధ శత్రువులుగా వ్యవహరించే పార్టీలు సైతం మద్దతివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. తాను లాభ పడుతూ ఇతర పార్టీలను ఇరుకున పెట్టేలా ఇలా స్కెచ్ వేశారు మోదీ.  ఇక ఈ పరిణామాలు పక్కనపెడితే.. కీలక నిర్ణయాలు తీసుకునేముందు, వాటిని ప్రకటించే ముందు ఇంత రహస్యంగా ఉంచడంలో మోదీని మించినోళ్లు లేరని స్పష్టమవుతోంది.
నోట్ల రద్దు కానీ, ఈబీసీలో 10 శాతం కోటా ప్రతిపాదన కానీ ఈ రెండిటిని పరిశిలిస్తే ఈ విషయం అందరికీ తెలుస్తుంది. అంతేకాదు.. ఇలా రహస్యంగా తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రత్యర్థి పార్టీలు గానీ, రాజకీయ విశ్లేషకులు కానీ నోరెత్తకుండా చేయటం మోదీకే సాటి. అయితే అలా తీసుకున్న ఆ నిర్ణయాలు సక్సెస్ అని మాత్రం చెప్పలేం. ప్రజలంతా ఇది గమనిస్తూనే వస్తున్నారు. ఇదిలా ఉంటే.. మోదీ వేసే అడుగులు ఊహించని కాంగ్రెస్ నేతలు తీరా ఇప్పుడు మోదీ వేయబోయే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తున్నారట. దేశంలోని రైతు రుణ మాఫీ అంటారా? లేదా రాత్రికి రాత్రే నిరుద్యోగ భృతి ఇస్తారా? అని తలలు పట్టుకుంటున్నారట. చూడాలి మరి.. మోడీ సీక్రెట్లు ఇంకెన్ని బయటకు వస్తాయో! ఎంతమందిని అయోమయంలో నెట్టేస్తాయో!
Tags:Narendra Modi specializing in sketches

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *