మల్టీ స్టారర్ మూవీలో నరేశ్

Naresh is a multi starre movie
Date:02/05/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
దూకుడుగా వస్తున్న కొత్త హీరోల దెబ్బకు సరైన హిట్టు పడక అల్లరి నరేశ్ బాగా వెనుకపడటం తెలిసిందే. హీరోగా గ్యాప్ తీసుకున్న నరేశ్, తాజాగా కొత్త ప్రాజెక్టుకు సమాయత్తమైనట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీ తనకు పాజిటివ్‌గా ఉన్నపుడు వేగంగా 50 చిత్రాలు పూర్తి చేసిన నరేశ్, ఇటీవలి కాలంలో హీరోగా బాగా వెనుకపడ్డాడు. ఆమధ్య చేసిన చిత్రాలు వరుస ఫ్లాపులు కావడంతో మంచి కథ కోసం ఎదరు చూస్తూనే -ముఖ్యపాత్రల్లో కనిపించేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే మహేష్‌బాబు హీరోగా వస్తున్న ‘మహర్షి’ చిత్రంలో హీరోకి మిత్రుడిగా కీలకమైన పాత్ర చేశాడు నరేశ్. ఈ సినిమా తరువాత నరేశ్ చేయనున్న ప్రాజెక్టు ఏమిటి? అన్న సమయంలో -ఎస్వీ కృష్ణారెడ్డితో సినిమా చేస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎస్వీ కృష్ణారెడ్డి సిద్ధం చేసుకున్న మల్టీస్టారర్ ప్రాజెక్టులో నరేశ్‌తోపాటు మరో హీరో కూడా చేయనున్నాడని చెబుతున్నారు. ఎస్వీఆర్ మిడియా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.
Tags: Naresh is a multi starre movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *