Natyam ad

వైసీపీ గూటికి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి

– ఈనెల 30న సీఎం జగన్ సమక్షంలో అధికారికంగా చేరిక

– ఫలించిన మిథున్ రెడ్డి మంత్రాంగం

– మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి పెరగనున్న బలం..

 

Post Midle

మదనపల్లి ముచ్చట్లు:

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి ముహూర్తం ఖరారైంది. గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు తటస్థంగా ఉన్న సంగతి విధితమే. నరేష్ కుమార్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పలుమార్లు చర్చలు సాగించినట్లు సమాచారం. ఈనెల 30న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో నరేష్ కుమార్ రెడ్డి వైసీపీలో లాంఛనంగా చేరనున్నారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి విధేయుడుగా ముద్రపడ్డ నరేష్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనుండటంతో మదనపల్లి నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

 

మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం సాగించిన నరేష్ కుమార్ రెడ్డి ట్రేడ్ యూనియన్ నేతగా ,మున్సిపల్ చైర్మన్, మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా, శాసనమండలి సభ్యులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. కాంగ్రెస్ పార్టీతో తనరాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నరేష్ కుమార్ రెడ్డి మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారు. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నరేష్ కుమార్ రెడ్డికిదశాబ్దాలుగా అవినాభావసంబంధం ఉంది.ఆ కారణంగా నరేష్ కుమార్ రెడ్డికి మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున రెండుమార్లు టికెట్ వచ్చే అవకాశాలు వచ్చినప్పటికీ హస్తిన రాజకీయాల వల్ల చేజారవలసి వచ్చింది. అయినప్పటికీ నరేష్ కుమార్ రెడ్డి ఏ మాత్రం నిరాశ చెందకుండా పార్టీనే అంటిపెట్టుకుని వచ్చారు.

 

 

 

2011లో ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేష్ కుమార్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే ఆ ఎన్నికల్లో నరేష్ కుమార్ రెడ్డి ఒక్కఓటు ఓటమి చెందడం, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నరేష్ కుమార్ రెడ్డి శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానాలు వెల్లువెత్తాయి. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అప్పటి మంత్రి ఎన్.అమర్నాథరెడ్డి, గల్లా అరుణకుమారిలు ఎమ్మెల్సీగా తిరిగి అవకాశం కల్పిస్తామని చెప్పడంతో నరేష్ కుమార్ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్, స్థానికసంస్థల ఎన్నికలలో నరేష్ కుమార్ రెడ్డి తన రాజకీయ చతురతతో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. ముఖ్యంగా మదనపల్లి మున్సిపల్ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నిక కావాల్సిన తరుణంలో తన అనుచరులైన ఇద్దరుఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొడవలి శివప్రసాద్ ను చైర్మన్ గా ఎన్నిక కావడంలో నరేష్ కుమార్ రెడ్డి కీలక పాత్ర వహించారు. దీంతో నరేష్ కుమార్ రెడ్డిపేరు అధిష్టానం వద్ద మారుమ్రోగి పోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏకంగా రాష్ట్ర టి ఎన్ టియుసిఅధ్యక్షులుగా నరేష్ కుమార్ రెడ్డిని నియమించారు. అలాగే ఎమ్మెల్సీగా అవకాశంఇస్తారన్న ఊహాగానాలు అప్పట్లో పార్టీలో జోరుగా వినిపించాయి.

 

 

 

 

 

తెలుగుదేశం పార్టీలో నరేష్ కుమార్ రెడ్డి హవా మొదలు కావడంతో స్థానికంగా వున్న కొంతమంది
టిడిపి నేతలు ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్న నరేష్ కుమార్ రెడ్డి భూవివాదాలకు పాల్పడ్డారని పేర్కొంటూ స్థానికంగా గల కొంతమంది టిడిపి నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. స్థానిక నేతల ఫిర్యాదులపై నరేష్ కుమార్ రెడ్డి తీవ్ర మనస్థాపం చెంది విచారణ చేయాల్సిందిగా ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే నరేష్ కుమార్ రెడ్డి టిఎన్ టియుసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో కార్మిక దినోత్సవం రోజున అధిష్టానం ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించిన జిల్లా ముఖ్య నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో సమావేశం చివరలో నరేష్ కుమారెడ్డికి అప్పట్లో పిలుపు అందింది. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా
అధిష్టానం తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నరేష్ కుమార్ రెడ్డి కొంతకాలంగా రాజకీయాలకుదూరంగా ఉంటూ వస్తున్నారు.నరేష్ కుమార్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీకి దూరంగా ఉండటం గ్రహించిన జిల్లా టిడిపి ముఖ్య నాయకులు పలుమార్లు ఆయనతో చర్చించినట్లుతెలిసింది.

 

 

 

 

ముఖ్యంగా మదనపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం తనను టార్గెట్ చేయడం పట్ల ఆయన వారివద్ద అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడేళ్లపాటు తనను టార్గెట్
చేసినప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసి నట్లు వారికి వివరించినట్లుసమాచారం. స్థానిక టిడిపి నేతల వైఖరి,ఓవైపు టిడిపి అధిష్టానం తగిన ప్రాధాన్యతఇవ్వకపో వడం పట్ల అసంతృప్తి చెందిననరేష్ కుమార్ రెడ్డి కొంతకాలంగా రాజకీయాల పట్ల తటస్థంగా ఉంటున్నట్లు సమాచారం. తన రాజకీయ భవిష్యత్తు విషయంలో నరేష్ కుమార్ రెడ్డి త్వరలోనేఏదో ఒక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు గత కొంతకాలంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఊహగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పలుమార్లు నరేష్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపి వైకాపాలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిసింది. దీంతో నరేష్ కుమార్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెజార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరాల్సిందిగా నరేష్ కుమార్ రెడ్డి పై ఒత్తిడి చేయడంతో పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 30న మదనపల్లెలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండటంతో ఆయన సమక్షంలో నరేష్ కుమార్ రెడ్డి, కుమారుడు బండి శశాంక్ రెడ్డిలు లాంఛనంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

 

Tags: Naresh Kumar Reddy, former MLC of YCP Guti

Post Midle