నవంబర్ 29న నరేష్ రఘుపతి వెంకయ్య నాయుడు చిత్ర విడుదల..

Date:06/11/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు. ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలవబడే రఘుపతి వెంకయ్య జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో నవంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఈ సినిమా గురించి నరేష్ మాట్లాడుతూ.. రఘుపతి వెంకయ్య గారి పాత్రలో నటించడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను.. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం ఇది. తెలుగు సినిమా బతికున్నంత వరకు ఈ చిత్రం అందరికీ గుర్తుండిపోతుంది. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ.. తెలుగు సినిమా కోసం రఘుపతి వెంకయ్య గారు చేసిన కృషిని గుర్తు చేయడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ఈ సినిమా కోసం చాలా రీసర్చ్ చేసాం.. నటీనటులు కూడా తమ ఉత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు రాఘుపతి వెంకయ్య నాయుడు సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు: నరేష్ వికే, తణికెళ్ల భరణి, మహర్షి, వాహిని, సత్య ప్రియ, భావన, అఖిల్ సన్నీ, మునిచంద్ర, సాయికాంత్, చాణక్య, దేవ్ రాజ్

తెలుగులో శ్రీరెడ్డికి మూవీ

Tags: Naresh Raghupathi Venkaiah Naidu releases movie on November 29th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *