అంత‌రిక్షంలో సునామీల‌ను గుర్తించిన నాసా ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

 

కంప్యూట‌ర్ స్టిమ్యులేష‌న్ ఆధారంగా నాసాకు చెందిన ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు అంత‌రిక్షంలో సునామీల‌ను గుర్తించారు నాసా శాస్త్ర‌వేత్త‌లు. భూకంపాలు, నీటి అడుగున అగ్నిప‌ర్వ‌తాల విస్ఫోట‌నాల వ‌ల్ల స‌ముద్ర‌తీర‌ప్రాంతాల్లో సునామీలు వ‌స్తాయ‌ని మ‌న‌కు తెలుసు. అయితే, అదేమాదిరిగా మ‌న భూగ్ర‌హానికి ఆవ‌ల అంత‌రిక్షంలో కూడా సునామీని గుర్తించారు. ఈ సునామీలు బ్లాక్‌హోల్స్ వ‌ల్ల సంభ‌విస్తున్నాయ‌ని అంచ‌నా వేశారు. బ్లాక్‌హోల్స్ గురుత్వాక‌ర్ష‌ణ నుంచి వాయువులు త‌ప్పించుకోవ‌డం, రేడియేష‌న్ వ‌ల్ల భారీస్థాయిలో సునామీ ఏర్ప‌డుతున్న‌ద‌ని తేల్చారు. ఇది దాదాపు ప‌ది కాంతి సంవ‌త్స‌రాల వ‌ర‌కూ విస్త‌రించి ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అంత‌రిక్షంలో చాలా బ్లాక్‌హోల్స్ ఇలాంటి సునామీల‌ను ఏర్ప‌రుస్తున్నాయ‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. కాగా, అంత‌రిక్షంలో సునామీకి సంబంధించిన వీడియోను నాసా విడుద‌ల చేయ‌గా, అంతా ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: NASA astronomers spot tsunamis in space

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *