Natyam ad

పుంగనూరులో ఉద్యోగుల బ్యాలెట్లకు దేశం ఒత్తిళ్ళు

పుంగనూరు ముచ్చట్లు:

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్ల కోసం తెలుగుదేశం పార్టీ నానతంటాలు పడింది. ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్లను బసవరాజ హైస్కూల్‌లో దాఖలు చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో 2062 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వేయాల్సి ఉంది. ఉదయం నుంచి జరిగిన పోస్టల్‌ బ్యాలెట్ల సమర్పణలో వెహోత్తం ఉద్యోగులు 1507 దాఖలు చేశారు. ఇలా ఉండగా పోస్టల్‌ బ్యాలెట్లను ఎలాగైన తమ పార్టీ కైవసం చేసుకోవాలన్న దురాలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆపార్టీ సన్నిహితులైన ఉద్యోగులు కొంత మంది ఉద్యోగులు పలు రకాలుగా ఆశచూపి లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ఒకొక్క ఓటుకు రూ. 5వేలు ఇస్తామని ఆశ చూపారు. ఉద్యోగులు ప్రలోభాలకు లొంగకపోవడంతో ఏకంగా బెదిరింపులకు తెరతీశారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, అప్పుడు మీ కథ చూస్తామంటు హెచ్చరికలు చేశారు. కానీ ఎక్కువ మంది ఉద్యోగస్తులు మాత్రం ఎలాంటి బెదిరింపులకు , ప్రలోభాలకు లొంగకుండ నిజాయితీగా ఓట్లు వేసి వెళ్లడం తెలుగుదేశం వర్గాలకు మింగుడు పడలేదు. దీనిపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, తెలుగుదేశం వారితో కుమ్మకై బెదిరించే సంస్కతికి దిగడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.

 

Post Midle

Tags: Nation pressures for employee ballots in Punganur

Post Midle