ఏపీఎస్పీడీసీఎల్ కు జాతీయ అవార్డు
తిరుపతి ముచ్చట్లు:
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసి) ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాధ రావు ఈ అవార్డును అందుకున్నారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంగళవారం 15వ ఇంధన సదస్సును వెర్చువల్ విధానంలో నిర్వహించారు. విద్యుత్ సంస్థలో ఆవిష్కరణల ప్రభావ అంశంలో చేస్తున్న కృషిలో జాతీయ స్థాయిలో ఏపీఎస్పీడీసీఎల్ తృతీయ స్థానంలో నిలిచినట్లు ఈ సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో భాగంగా జరిగిన ఐసీసీ అవార్డు-2022 ప్రదాన కార్యక్రమం సందర్భంగా జ్యురీ సభ్యుల నుంచి ఈ అవార్డును అందుకున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కు జాతీయ అవార్డు లభించడం పట్ల సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హెచ్. హరనాధ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగుల అత్యుత్తమ పనితీరుకు నిదర్శనంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగులు జవాబుదారీతనం, నిజాయితీ, పారదర్శకతతో విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా సంస్థ మరెన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షించారు. సంస్థకు జాతీయ అవార్డు లభించడం పట్ల అధికారులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: National Award to APSPDCL