బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
విశాఖపట్నం ముచ్చట్లు:
బీసీ జనాభా దామాషా పద్ధతిలో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలని జాతీ య బీసీ సంక్షేమ సంఘం నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తమను విస్మరించే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతా మని హెచ్చరించారు. విశాఖలో జాతీ య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య క్షులు వెంగళరావు,విశాఖ జిల్లా అధ్య క్షులు డబ్బీర్ కుమార్ స్వామి మాట్లా డారు. బీసీ జనగణన చేపట్టి బీసీలకు న్యాయం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. తమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్ కృష్ణ య్య బీసీల సంక్షేమానికి వారి హక్కుల సాధనకై నిరంతరం పోరాడుతున్నారని చెప్పారు. పార్లమెంట్లో బీసీ జనాభా ప్రకారం సుమారు 200 ఎంపీలు బీసీలు ఉండాలని అయితే కేవలం 70 లోపే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పక్షాలు వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Tags;National BC Welfare Association demands reservation for BCs
