Natyam ad

లింగ వివక్షత వ్యతిరేక జాతీయ ప్రచార  కార్యక్రమం

కడప ముచ్చట్లు:

కడప జిల్లా వేముల మండలం వ్యాప్తంగా లింగ వివక్షత వ్యతిరేక జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా వేముల గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఎన్జీవోలు యువతతో అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిఆర్డిఏ ఆంజనేయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగము ఆడ మగ అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమాన హక్కులు సమాన విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతున్నదని తల్లిదండ్రులు బాల బాలికల విద్య భేదాభిప్రాయం లేకుండా చూడాలని కోరారు.మహిళల పైన జరిగే అఘాయిత్యాలు హత్యాచారాలు గృహహింస ర్యాగింగ్ పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులు కల్పించడం మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాల పట్ల మహిళల అవగాహన కలిగి ఉండి మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013 ప్రకారము పిర్యాదులు చేయవచన్నారు. మహిళా చట్టాలను అవగాహన చేసుకోవాలని తెలిపారు.లింగ వివక్షతకు వ్యతిరేకంగా ప్రభుత్వ విభాగాలు సివిల్ సొసైటీస్ యువకులు వాలంటీర్లు  డ్వాక్రా మహిళలు, తల్లిదండ్రులుగ్రామస్థాయిలో చర్చలను రేకెత్తించడం ద్వారా సమస్యలను గుర్తించి పరిష్కరించడం ద్వారా గ్రామీణ వాతావరణాన్ని మరింత మహిళా శ్రేయస్కరంగా రూపొందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్లు జ్యోతి రామలింగయ్య గ్రామ సమాఖ్య అసిస్టెంట్ కుమారి డ్వాక్రా లీడర్లు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

 

Tags: National Campaign Against Gender Discrimination

Post Midle
Post Midle