చౌడేపల్లె మండలం కాటిపేరిలో జాతీయ జెండా దిమ్మె ధ్వంసం
– నేమ్‌బోర్డుతోపాటు అక్షరాలను చెరివేసిన దృశ్యం
– టిడిపి నాయకుల పనే నంటూ ఆరోపణలు
– సర్పంచ్ భర్త అంతుచూస్తామంటూ రాతలు
చౌడేపల్లె ముచ్చట్లు:
స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండా దిమ్మె, తో పాటు ఉప్పు,తో మూడు రంగుల తో రూపొందించిన జెండాను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వసం చేసిన సంఘటన జరిగింది. కాటిపేరి పంచాయతి అగస్తిగానిపల్లె వద్ద గల దిగువ చెరువు( అగస్తీశ్వర చెర్వు)లో ఉపాధిహామీ నిధులతో అమృత్ సరోవర్ కార్యక్రమంలో రూ:9.60 లక్షలతో అభివృద్దిచేశారు. పనులు పూర్తికావడంతో ఉన్నాధికారుల ఆదేశాలమేరకు స్వాతంత్య్ర దినోత్సవం నాడు వేడుకగా చెర్వులో సంబరాలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు సర్పంచ్ సరితా రెడ్డి, ఉపాధి ఏపిఓ శ్రీనివాస్ యాదవ్‌లు కలిసి ఆదివారం సాయంత్రం ఏర్పాట్లు చేశారు. ఉదయం వెళ్ళగా అప్పటికే జెండా దిమ్మెను ధ్వసం చేసి, నేమ్ బోర్డులో బురదమట్టితో కొట్టి అక్కడ వ్రాసిన రాతలు, దేశభక్తి సూక్తులకు చెరిపేశారు. ఉప్పుతో వేసి దేశ ముఖచిత్రంను చె రిపి గోడలకు అసభ్యకర పదాలను రాశారు. సర్పంచ్ భర్త సుధాకర్‌రెడ్డి అంతుచూస్తామని, అసభ్యకరంగా వ్రాతలు వ్రాశారు.టిడిపి నాయకులు ఓర్వలేక ఈ కుట్రకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ అనుమానితులపై సర్పంచ్ సరితారెడ్డి, ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాధుచేశారు.

Tags: National flag block vandalized in Katiperi of Chaudepalle mandal
