జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి.
-మేధావుల డిమాండ్
తిరుపతి ముచ్చట్లు:

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహావిష్కరణ ( హనుమాన్ జంక్షన్) మహోత్సవం గణతంత్ర దినోత్సవం నాడు 26/01/2023 హనుమాన్ జంక్షన్ లో జరగనుంది. ఈ మహోత్సవాలలో భాగంగా తిరుపతిలోని శంకరంబాడి సాహితీ పీఠం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో పింగళి వెంకయ్య కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని 10 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలకు పింగళి వెంకయ్య చిత్రపటం, జాతీయ పతాకము మరియు మహాత్మా గాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. శంకరంబాడి సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి మస్తానమ్మ సభాధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యాయవాది మట్ట పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య 130 కోట్ల భారతీయులకు స్ఫూర్తి ప్రదాత చిరస్మరణీయుడు అని కొనియాడారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎన్ విశ్వనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన ఎంతోమంది వీరులను మనం జీవితాంతం గుర్తు పెట్టుకుని వారి మార్గంలో నడవాలి అని చెప్పారు. 15వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి షాలిని మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కనుక విద్యార్థులు నిత్యజీవితంలో దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు సాకం నాగరాజ మాట్లాడుతూ గురజాడ చెప్పిన విధంగా దేశ సమైక్యత కోసం మానవులంతా కలిసి నడవాలోయ్ అని విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగాన్ని ఇచ్చారు. సంకల్ప సేవా సమితి అధ్యక్షుడు న్యాయవాది ఎన్ రాజారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్వకేట్ రాధికా రాణి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,బండి మధుసూదన్ రెడ్డి, డి నిర్మల, ఆనంద్, టి ఆనంద్, రవికుమార్, ముని శారద, మారుతి దేవి, శ్యా మలమ్మ, వెంకటాద్రి, హేమంతు, చందు, ప్రసన్న పిడి మొదలగు వారు పాల్గొన్నారు.
Tags; National flag designer Pingali Venkaiah should be given Bharat Ratna.
