సూది బెజ్జం లో జాతీయ జెండా

Date:15/08/2020

జగిత్యాల  ముచ్చట్లు:

సూదిలో దారం పెట్టడానికే మనం చాలా అవస్థలు పడతాం…అలాంటి సూది బెజ్జం లో జాతీయ జెండాను తయాడుచేశాడు. జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్. గతంలో  ఎన్నో సూక్ష్మ కళారూపాలు తయారు చేసిన  గుర్రం దయాకర్ ఈసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తనదైన శైలిలో సూది బెజ్జం లో బంగారంతో జాతీయ జెండా రూపొందించాడు. స్వాతంత్ర దినోత్సవం  కావున భారత జాతీయ జెండాను తయారు చేయాలి అని ఆలోచన వచ్చిందే తడవుగా బంగారంతో  జెండాను తయారు చేసాడు. ముఖ్యమైన రోజులను గుర్తుంచుకొని వాటి సూక్ష్మకళారూపాలని తయారుచేయడం ఇతని హాబీ. ఇలా బంగారంతో జెండాను తయారు చేయడానికి అతనికి 0.05  మిల్లిగ్రాముల బంగారాన్ని వినియోగించాడు.  దీన్ని తయారు చేయాడానికి ఆరు గంటల సమయం పట్టిందని అంటున్నాడు.

నీటి ప్రవాహం లో చిక్కుకున్న యువకుడిని కాపాడిన హుజురాబాద్ పోలీసులు.

Tags: National flag in needle drill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *