కందూరులో రెపరెపలాడిన జాతీయ జెండాలు

పుంగనూరు ముచ్చట్లు:


చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ సోమల మండలం మేజర్ పంచాయతీ కందూరు నందు జాతీయ జెండా శుక్రవారం రెపరెపలాడింది. స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను గ్రామ వీధులలో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వెలుగు సమాఖ్య సంఘ సభ్యులు అధికారులు, అనధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు మూడు కిలోమీటర్ల మేర జాతీయ జెండా వెంబడి నడిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి హాజరయ్యారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ లౌకికవాదాన్ని చాటి చెప్పే విధంగా అన్ని మతాల, కులాలవారు జాతీయ జెండా వెంబడి నడిచి సంఘీభావం తెలపడం అభినందనీయం అన్నారు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడం ఈ సందర్భంగా మహనీయులను చేసిన కృషినజ నెమరు వేసుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. నియోజకవర్గంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలను అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజలు సంయుక్తంగా నిర్వహించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు ఎంపీపీ ఈశ్వరయ్య మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు శివారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, అమాస మోహన్లు, వైస్ ఎంపీపీలు ప్రభాకర్ , సయ్యద్ భాష సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

Tags: National flags fluttered in Kandur

Leave A Reply

Your email address will not be published.