National Highway hell

నేషనల్ హైవే నరకం

Date:27/11/2020

నెల్లూరు  ముచ్చట్లు

స్వర్ణ టోల్ వే, ఐజెఎం కంపెనీలకు చెన్నై,కలకత్తా హైవే పై కోట్లు దోచుకోవడంలో ఉన్న శ్రధ్ధ రోడ్ల పనులపై లేదనే విమర్సలు వెల్లువెత్తుతున్నాయి..తడ నుండి నెల్లూరు వరకు ఉన్న నేషనల్

హైవే పై ఐజెఎం సంస్ద రోడ్ల పనుల్లో నిర్లక్ష్యం నివర్ తుఫాన్ వేళ లక్షలాది వాహనదారులకు నరకం చూపుతుంది.
జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ రెండు రోజులుగా నిలిచిపోయింది. .నివర్  తుఫాన్ ప్రభావం వల్ల ఆది శంకర కాలేజీ దగ్గర పంబ లేరు వరద ఉధృతి  కారణంగా గుంటూరు చెన్నై

జాతీయ రహదారి వద్ద వరదతో  ట్రాఫిక్ జామ్ అవుతుంది.గూడూరు నెల్లూరు మధ్యలో 20 కిలోమీటర్ల  వరకు వాహనాలు బారులు తీర్రి నిలిచిపోయాయి బస్సులు   కార్లు లారీలు పెద్ద

వాహనాలు ఇరుక్కుపోయాయి అంబులెన్సులు సైతం ట్రాఫిక్ జామ్ లొచిక్కుకున్నాయి బస్సులో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు రోజుల తరబడి వాహనాలు ట్రాఫిక్ జామ్ లో

నిలిచిపోవడంతో గమ్యం చేరడానికి గంటల తరబడి నిరీక్షిస్తున్నారు దీనికి వరద ఉధృతి ఒక కారణమైతే ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్లు చేస్తున్న నిర్లక్ష్యం పెద్ద శరాఘాతంగా

మారిందదనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్వర్ణ టోల్ వేస్ కు,ఐజెఎం కంపెనీ కి ఉన్న పలుకుబడి,లోకల్ లెవల్లో ఉన్న బ్రోకర్లు,లీడర్స్ కారణంగ నేషనల్ హైవే అధికారులు అవినీతితో వీరి

అక్రమాలను పట్టించుకోవట్లేద ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

వాగులో కొట్టుకుపోయిన మినీ వ్యాన్

Tags:National Highway hell

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *