కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి

Date:6/8/2019

ఢిల్లీ ముచ్చట్లు

….విషాదంలో బిజెపి నేతలు …

కేంద్ర మాజీ మంత్రి బిజెపి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో రాత్రి కన్నుమూశారు .సుష్మా స్వరాజ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్లో చికిత్సలు పొందుతున్నారు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో ప్రధాని నరేంద్ర మోదీతో సహా కేంద్ర మంత్రులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు .ఈమె మృతితో బిజెపి పార్టీ విషాదంలో మునిగిపోయింది .

మళ్లీ జనాల్లోకి అయ్యన్న పాత్రుడు

Tags:BJP EX -Senior Minister sushma swaraj died

ఇండియా మ్యాచ్ కు వర్షం అడ్డంకే

Date:12/06/2019

లండన్ ముచ్చట్లు:

ఇంగ్లాండ్‌లో వరల్డ్ కప్ ఏ ముహూర్తాన మొదలైందో కానీ.. వరుణుడు మాత్రం వదలడం లేదు. వర్షం కారణంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. శ్రీలంక ఆడాల్సిన రెండు మ్యాచ్‌లైతే ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. మ్యాచ్‌లకు పదే పదే వర్షం ఆటంకం కలిగిస్తుండటంతో వరల్డ్ కప్ కళ తప్పుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాటింగ్‌హామ్ వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ వారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాటింగ్‌హమ్‌లో వర్షాలు కురుస్తుండటంతో టీమిండియా ప్రాక్టీస్‌కు చేయడానికి కూడా వీల్లేకుండా పోయింది. వరుసగా రెండు రోజులపాటు టీమిండియా ప్రాక్టీస్‌కు దూరమైంది. బుధవారం రాత్రి వరకు నాటింగ్‌హామ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని.. గురువారం మధ్యాహ్నం వరకు జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కాకపోయినప్పటికీ.. అంతరాయం కలగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొంది ఉత్సాహం మీదుంది.

 

జూలై 15న చంద్రయాన్

TagsLIndia’s match against rain

తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

ఇంగ్లాండ్,  పాకిస్తాన్ జట్టులకు జరిమానా

Date:04/06/2019

లండన్ ముచ్చట్లు :

న్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆతిథ్య ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. పాకిస్థాన్ జట్టు

సభ్యులతో పాటు మరో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు జరిమానా విధించారు.ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్ రిఫ‌రీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.నిర్ణీత సమయం కన్నా ఒక

ఓవర్‌ను ఆలస్యంగా వేసినందుకు పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కూడా జరిమానా విధించారు. స్లో ఓవర్‌రేట్ కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధించారు. అలాగే జట్టులోని

మిగతా ఆటగాళ్లకు తమ మ్యాచ్ ఫీజుల్లో 10శాతం జరిమానా వేశారు. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో నిషేధిత వ్యాఖ్యలు లేదా అసభ్యకరంగా మాట్లాడినందుకు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌కు

15శాతం ఫైన్ వేశారు. అలాగే అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లాండ్‌ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు 15శాతం జరిమానా పడింది. ఫైన్‌తో పాటు చెరో డీమెరిట్ పాయింట్‌ను కూడా ఈ ఇద్దరి

ఖాతాల్లో వేశారు.

 

సైకో కిల్లర్ అరెస్ట్

Tags:Fined for England and Pakistan squads

 విరాట్ ను వేధిస్తున్న గాయాలు

Date:04/06/2019

లండన్  ముచ్చట్లు:

ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కి ముందే భారత్ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో బుధవారం తొలి మ్యాచ్‌లో టీమిండియా తలపడాల్సి ఉండగా.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో.. అక్కడే ఉన్న ఫిజియో ప్రథమ చికిత్స చేసినా.. నొప్పి తగ్గకపోవడంతో ఐస్ వాటర్‌లో గాయమైన వేలుని ఉంచి ప్రాక్టీస్ సెషన్‌ని కోహ్లీ వీడినట్లు తెలుస్తోంది. గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆడనుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడటం చాలా కీలకం. కానీ.. తాజా వేలి గాయంతో అతను మ్యాచ్ ఆడతాడా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. సుదీర్ఘంగా జరగనున్న ప్రపంచకప్‌లో కోహ్లీ గాయంతో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేయకపోవచ్చు. కానీ.. వేలి గాయమే కావడంతో మ్యాచ్ ఆడకుండా రిజర్వ్ బెంచ్‌పై కూర్చొనేందుకు విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ విరాట్ కోహ్లీ మ్యాచ్‌కి దూరమైతే అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ లేదా విజయ్ శంకర్ ఆడే అవకాశం ఉంది. అప్పుడు మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనుండగా.. టీమ్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండనున్నారు.

 

పవన్ కళ్యాణ్ దారెటు

Tags: Virus fending injuries

భార్య తో సెక్స్… పోర్న్ సంస్థలకు అమ్మకం

Date:03/06/2019

ముంబై ముచ్చట్లు:

కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యాపారవేత్త నీచంగా ప్రవర్తించాడు. పోర్న్ వెబ్‌సైట్లకు బానిసై భార్యను బజారుకీడ్చాడు. భర్త వింత మనస్తత్వం, వేధింపులతో విసుగు చెందిన ఆ ఇల్లాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తన భర్త గురించి చెప్పిన విషయాలు విని పోలీసులకే దిమ్మ తిరిగింది. బెంగళూరులోని సదాశివ నగర్‌లో బయటపడింది ఈ దారుణం. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యాపారవేత్త.. బెంగళూరులోని సదాశివ నగర్‌లో కుటుంబంతో కలిసి స్థిరపడ్డాడు. కొద్దిరోజులుగా పోర్న్ వెబ్‌సైట్లకు బానిసై.. వింతగా ప్రవర్తిస్తూ.. లైంగికంగా వేధిస్తున్నాడు. భర్త కదే అని ఆమె భరిస్తూ వచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో.. ఆమెకు తెలియకుండా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. పడకగదిలో భార్యతో ప్రైవేట్‌గా గడుపుతూ సీసీ కెమెరాలో రికార్డ్ చేశాడు. తర్వాత సీసీ కెమెరాను ఆమె గమనించింది. అంతటితో ఆగని సదరు వ్యాపారవేత్త.. భార్య ఈ మెయిల్ హ్యాక్‌ చేసి.. ఆమె స్నేహితులకు అశ్లీల మెసేజ్‌‌లు పంపేవాడు. భర్త తీరుతో విసుగెత్తిన ఆమె నిలదీసింది.. దీంతో కోపంతో ఆమెపై దాడి చేసి.. ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆదివారం ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కొద్దిరోజులుగా తనను వేధిస్తున్నాడని.. తనను నిత్యం అనుమానించేవాడని ఆమె ఆరోపిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఐపీఎల్ ఒత్తిడితో భారత్ లేట్ ఎంట్రీ

Tags:Sex with wife … selling to porn companies

ఐపీఎల్ ఒత్తిడితో భారత్ లేట్ ఎంట్రీ

Date:03/06/2019

లండన్ ముచ్చట్లు:

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ 2019లో ఒక్క భారత్ తప్ప అన్ని జట్లూ మ్యాచ్‌లు వరుసగా ఆడేస్తున్నాయి. టోర్నీ మొదలై ఐదు రోజులు గడుస్తున్నా.. భారత్ ఇప్పటి వరకూ ఎంట్రీ ఇవ్వలేదు. మరో రెండు రోజుల్లో అంటే బుధవారం.. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకి అది టోర్నీలో మూడో మ్యాచ్ కానుంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.. టీమిండియా ఎంత ఆలస్యంగా కప్ వేట ప్రారంభించనుందోనని..! వాస్తవానికి ప్రపంచకప్‌లో భారత్ జట్టు లేట్ ఎంట్రీకి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఎలా అంటే.. ఐపీఎల్ 2019 సీజన్‌లో నెలన్నరపాటు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడిన భారత్ ఆటగాళ్లకి కొంచెం రెస్ట్ కావాలని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో.. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని సవరించిన ఐసీసీ.. టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా రూపొందించింది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 సీజన్ మే 12న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు నియమిత లోధా కమిటీ.. టీమిండియా ఆడే టోర్నీ, టోర్నీకి మధ్య కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలని సిఫారసు చేసింది.

 

 

 

 

 

 

 

 

దీంతో.. ఐపీఎల్ 2019, ప్రపంచకప్‌ 2019 మధ్య ఈ వ్యవధి నియమాన్ని బీసీసీఐ పాటించినప్పటికీ.. ఆటగాళ్లకి మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీని అభ్యర్థించింది. ఈ బ్రేక్ టైమ్.. ఆటగాళ్ల ప్రాక్టీస్‌తో గాయపడిన క్రికెటర్లు ఫిట్‌నెస్ సాధించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. ఐపీఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్‌.. ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. ఆదివారం జిమ్‌లో టీమిండియా ఆటగాళ్లతో పోటాపోటీగా అతను కసరత్తులు చేశాడు. మే 30న ప్రారంభమైన ప్రపంచకప్‌ని 11 వేదికల్లో 46 రోజుల పాటు నిర్వహించనుండగా.. మొత్తం 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూలై 14న లార్డ్స్‌లో ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది. డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో భాగంగా ప్రతి జట్టు లీగ్ దశలో 9 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

విశ్వక్ సేన్ అప్పుడు అలా… ఇప్పుడు ఇలా

Tags:Bharat Late Entry With IPL

 ఘజియాబాద్ లో రేప్

Date:01/06/2019

లక్నో ముచ్చట్లు:

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కామాంధులు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 13ఏళ్ల బాలికపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 8 నెలల క్రితం ఈ ఘటన జరగ్గా బాధితురాలు ఇప్పుడు 7నెలల గర్భవతిగా తేలింది. ఘజియాబాద్‌లోని ఖోడా కాలనీలో నివాసముంటున్న ఓ కుటుంబంలోని మైనర్ బాలిక ఇటీవల అస్వస్థతకు గురైంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో ఆమెను తల్లిదండ్రులు ఢిల్లీలోని లాల్‌బహుదూర్ శాస్త్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఆమె ఏడు నెలల గర్భవతి అని చెప్పడంతో అంతా షాకయ్యారు. దీంతో వారు బాలికకు అబార్షన్ చేయాలని కోరగా డాక్టర్లు అంగీకరించలేదు. ఈ విషయాన్ని డాక్టర్లు పోలీసులకు చెప్పడంతో వారు బాలికను విచారించారు. తమ కుమార్తెపై 8నెలల క్రితం ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని తమబిడ్డ చెప్పినా పరువు పోతుందన్న ఉద్దేశంతో బయటకు పొక్కనీయలేదని బాధితురాలి తల్లి పోలీసులకు చెప్పింది. అయితే తన కూతురు గర్భం దాల్చినట్లు తనకు తెలియదని, శరీరంలో మార్పులను గమనించలేదని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలో అబార్షన్ చేస్తే బాలిక ప్రాణాలకే ముప్పు అని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు నిరాశగా వెనుదిరిగారు.

9న తిరుమలకు ప్రధాని

Tags:Rape in Ghaziabad