జపాన్‌ను వణికించిన సముద్ర గర్భం భూకంపాలు

  Date:10/05/2019
  టోక్యో  ముచ్చట్లు :
జపాన్‌కు భూకంపాలు కొత్తేమీ కానప్పటికీ.. సముద్ర  గర్భంలో కొన్ని గంట‌ల వ్యవధిలో సంభవించిన రెండు భూకంపాలు జపాన్‌ను వణికించాయి. స్థానిక కాల‌మానం ప్రకారం.. గురువారం రాత్రి
10.43 నిమిషాల‌కు భూకంపం సంిభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా న‌మోదైంది. ఆతర్వాత శుక్రవారం ఉద‌యం 7.43 నిమిషాల‌కు  మరో సారి భూమి కంపించింది. దీని తీవ్రత
6.3గా రికార్డు అయ్యింది. ఈ భూకంపం సముద్రంలో సంభ‌వించ‌డంతో సునామీ ముప్పు ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. కానీ దాని తీవ్రత ఆ స్థాయిలో లేదని అధికారులు
వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి సునామీ హెచ్చరిక‌ల‌ను జారీ చేయ‌లేదు.రాజ‌ధాని టోక్యోకు నైరుతి దిశ‌గా స‌ముద్రంలో 35 కిలోమీట‌ర్ల లోతులో తొలి
భూకంపం సంభ‌వించింద‌ని అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్లడించింది. రెండో భూకంపం కూడా అదే ప్రాంతంలో 44 కిలోమీట‌ర్ల లోతున సంభ‌వించిన‌ట్లు ప్రకటించారు. దీని ప్రభావం
తీరప్రాంత పట్టణం మియాజ‌కీ-షీ పై ప‌డింది. 2011లో రిక్టర్‌ స్కేల్‌పై 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో వచ్చిన సునామీ అపార ఆస్తి, ప్రాణ నష్టం కలిగించిన విషయం తెలిసిందే.
Tags:Sea worm earthquakes shaken by Japan

అధికారులు సందర్శించారు

 Date:07/05/2019
పంజాబ్   ముచ్చట్లు :
పంజాబ్ రాష్ట్రం, హోషియర్ పూర్ జిల్లాలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర ఆగ్రోస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జ్యూస్ యూనిట్ ను తెలంగాణ ఆగ్రోస్ కార్పోరేషన్ అధికారులు సందర్శించారు….పంజాబ్ ఆగ్రోస్ వారు చేస్తున్న ఆగ్రోస్ ఫుడ్ ప్రాసెస్సింగ్ మరియు పండ్లు, కూరగాయాల రసంల కర్మాగారములు పరిశీలించి పెట్టుబడి, మార్కెటింగ్ , కార్పోరేషన్ కు రెవెన్యూ లాభాలు, యంత్రముల పైన  వివిధ అంశములు పైన  పూర్తిగా చర్చించి, పంజాబ్ ఆగ్రోస్ తయారు చేయు  ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు పరిశీలించి వీటన్నింటి పైన తెలంగాణ ఆగ్రోస్ కార్పోరేషన్ కూడా ఒక కార్యాచరణ రూపొందించి  సంస్ధను అభివృద్ధి పథంలో నడిపించుటకు ఈ పర్యటన  దోహద పడుతుందని భావిస్తున్నాం. పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు , ఎండి సురేందర్   మరియు జనరల్ మేనేజర్ చంద్ర రాజామోహన్ పాల్గొన్నారు.
Tags:Officials have visited

 ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం

 Date:07/05/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు :
ఇండోనేషియాలోని సినాబంగ్ అగ్నిపర్వతం ఈరోజు బద్దలైంది. ఈ సందర్భంగా అందులో నుంచి వచ్చిన బూడిద, పొగ దాదాపు 6,500 అడుగుల ఎత్తు వరకు కమ్ముకున్నాయి. దీని కారణంగా చుట్టు పక్కల ఉన్న గ్రామాలను బూడిద కమ్మేస్తోంది.సినాబంగ్ అగ్నిపర్వతం సుమత్రా దీవుల్లో ఉంది. 400 సంవత్సరాల తర్వాత 2010 నుంచి క్రియాశీలకంగా మారిన ఈ అగ్ని పర్వతం 2013లో బద్దలైంది. అప్పటి నుంచి అది యాక్టివ్ గానే ఉంది. 2014లో అగ్నిపర్వతం పేలుడు కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2016లో మరో ఏడుగురు చనిపోయారు. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ క్రియాశీలకంగా మారుతూ వచ్చిన ఈ అగ్ని పర్వతం, ఈరోజు మరోసారి నిప్పులు ఎగజిమ్మింది.అగ్నిపర్వతం నుంచి లావా ప్రవహించే అవకాశం ఉండటంతో, ప్రభావిత గ్రామాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరైనా చనిపోయారా? లేక గాయపడ్డారా? అనే సమాచారం వెల్లడి కాలేదు. ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన ‘నో-గో’ జోన్ లో ఎవరూ నివాసం ఉండక పోవడం గమనార్హం. ఇండోనేషియాలో దాదాపు 130 అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉన్నాయనేది ఒక అంచనా.
Tags:A volcano that broke in Indonesia

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుము పెంపు 

 Date:07/05/2019
వాషింగ్టన్‌  ముచ్చట్లు :
అమెరికాలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేందుకు ట్రంప్‌ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. అమెరికా యువతకు సాంకేతిక అంశాల్లో శిక్షణ ఇచ్చే అప్రెంటిస్‌ ప్రొగ్రామ్‌కు నిధులను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలెగ్జాండర్‌ అకోస్టా తెలిపారు. దీనితో అమెరికాకు ఉద్యోగులను పంపించే భారత ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం పడనుంది. 2020 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వార్షిక బడ్జెట్‌లో ఈ ప్రతిపాదనలు చేశారు. అయితే దరఖాస్తు రుసుమును ఎంత పెంచాలనుకుంటున్నారు.. ఏయే కేటగిరిలోని దరఖాస్తుదారులకు ఈ పెంపు వర్తిస్తుంది లాంటి పూర్తి వివరాలను అకోస్టా వెల్లడించేలేదు. కాగా.. హెచ్‌-1బీ దరఖాస్తు రుసుమును పెంచితే గనుక ఆ ప్రభావం ఎక్కువగా భారతీయ ఐటీ కంపెనీలపైనే పడనుంది. హెచ్‌-1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. ఇప్పుడు దరఖాస్తు ఫీజు పెంచితే.. ఐటీ కంపెనీలపై ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. కొత్త నిబంధనల కారణంగా గతేడాది దాదాపు ప్రతి నలుగురు దరఖాస్తుదారుల్లో ఒకరి దరఖాస్తును ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరస్కరించారు. ఈ వీసాల వల్ల అమెరికాలో పనిచేసే విదేశీయుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని, దీనివల్ల అమెరికన్లు నష్టపోతున్నారని చెబుతూ వీసా నిబంధనలను కఠినం చేశారు.తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలో 6.50లక్షల మంది వరకు విదేశీయులు హెచ్‌-1బీ వీసాలపై ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో అధికశాతం భారత్‌, చైనాల నుంచి వెళ్లినవారే. హెచ్‌-1బీ వీసాలపై ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం అనేక కఠిన నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
Tags:H-1B visa application fee hike

మార్కెట్ లో ‘సెక్స్ రోబోట్స్

Date:07/05/2019
టోక్యో ముచ్చట్లు:
సెక్స్ కోరికలు తీర్చేందుకు.. ‘సెక్స్ రోబోట్స్’ వచ్చేశాయ్. శృంగారంలో రెచ్చిపోవాలనుకునే వ్యక్తులు వాటితో ఎటువంటి తరహాలోనైనా సెక్స్ చేయవచ్చట. ఇందుకు అవి పూర్తిగా సహకరిస్తాయట. అందుకే వీటితో ఏకంగా ‘రెడ్ లైట్’ ఏరియానే ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? జపాన్‌లోని నగోయాలో. ప్రస్తుతం ఇప్పుడు నాలుగు ఆడ రోబోలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. ఆసియా అమ్మాయిలను ఇష్టపడేవారు వీటితో ఎంజాయ్ చేయోచ్చు. త్వరలో మగ సెక్స్ రోబోలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. లుమీడాల్స్ అని పిలిచే ఈ సెక్స్ రోబోలతో గడపాలంటే కొంచెం గట్టిగానే చెల్లించుకోవాలి. మూడు గంటల సేపు వాటితో గడపాలంటే రూ.22,670 చొప్పున చెల్లించాలి. ఒక గంట చాలనుకుంటే రూ.8,162 చెల్లించాలి. ప్రపంచంలో తొలి హైపర్ రియలెస్టిక్ సెక్స్ డాల్ వ్యభిచార కేంద్రం ఇదేనని, ఈ రోబోలు అచ్చం మనుషుల్లాగే ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మొరటుగా సెక్స్ చేయాలనుకునేవారికి ఇవే సరైనవని, వీటితో వారు ఏ విధంగానైనా సెక్స్‌లో పాల్గోవచ్చని తెలిపారు. వీటితో సెక్స్ చేస్తున్నంత సేపు.. నిజమైన మహిళతో చేస్తున్నట్లే ఉంటుందన్నారు. ఏమిటో లోకం పోకడ.. ఇప్పటికే జపాన్‌లో సగం మంది మగవాళ్లు సెక్స్ టాయ్స్‌తో సంసారం చేసేస్తున్నారు. ఇలాంటి రోబోలు వస్తే.. మహిళలు పిల్లలు కనే ‘యంత్రాలు’గా మారిపోతారేమో!!
Tags:In the market ‘sex robots

తల్లే కూతురు పాలిట మృత్యుపాశం

Date:07/05/2019
 న్యూయార్క్ ముచ్చట్లు:
కంటికి రెప్పలా చూసుకోవలసిన తల్లే కూతురు పాలిట మృత్యుపాశమైంది. ఆమె తన ప్రియుడితో ఆమెను రేప్ చేయించడమే కాకుండా.. ముక్కలుగా నరికించింది. ఈ దారుణం పెన్సిల్వేనియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిందితురాలు సారా ప్యాకర్‌ (41) పిల్లలను దత్తత ఇచ్చే అధికారిణిగా పనిచేసేది.  సారా, ఆమె భర్త డేవిడ్‌లు అనాథ పిల్లలను దత్తత తీసుకునేవారు. సమాజంలో మంచి మనుషులుగా వ్యవహరించే వీరు.. ఆ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడేవారు. 2007లో దత్తత తీసుకున్న గ్రేస్ (14) అనే చిన్నారితో కూడా డెవిడ్ ఇలాగే ప్రవర్తించాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి.. అతన్ని అరెస్టు చేశారు. దీంతో సారా కూడా ఉద్యోగం కోల్పోయింది. అప్పటి నుంచి గ్రేస్ మీద సారా కక్ష పెంచుకుంది.సారాకు 2013లో జాకబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితో సహజీవనం చేయడం ప్రారంభించింది. ఈ సందర్భంగా గ్రేస్‌ను హత్య చేయాలని జాకబ్‌ను కోరింది. 2016లో ఆమెను ఇంట్లోని మూడో అంతస్థు పైకి తీసుకెళ్లారు. అక్కడ జాకబ్.. తల్లి సారా ఎదురుగానే గ్రేస్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పికి అరుస్తుందనే కారణంతో మత్తు మందు ఇచ్చారు. అత్యాచారం సమయంలో గ్రేస్.. తల్లిని ఎంతో బతిమాలుకుందని, ఇందుకు సారా.. ‘నీ జీవితం ఇకపై అంతే’ అని సమాధానం తెలిపిందని.. జాకబ్ పోలీసుల విచారణలో చెప్పాడు. అత్యాచారం తర్వాత ఆమె పూర్తిగా అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఆమెకు మెళకువ వచ్చి కేకలు పెట్టకుండా ఆమె నోటిలో బంతిని కుక్కి నోరు కట్టేశారు. ఆ తర్వాత కాళ్లు చేతులు కట్టేశారు. ఎండ తీవ్రతకు ఆమె చనిపోతుందని భావించారు. అయితే, తర్వాత తిరిగి వచ్చేసరికి ఆమె బతికే ఉండగంతో పీక నులిమి చంపేశారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు చేసి.. పిల్లి విసర్జనల మధ్యలో దాచిపెట్టారు. మూడు నెలలు గడిచిన తర్వాత వాటిని నగరం శివారులో పడేశారు. అనంతరం సారా తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులకు సారాపై అనుమానం కలిగి తమదైన శైలిలో విచారణ జరిపేసరికి నిజాలు కక్కింది. ఈ ఘటనపై ఇటీవల తీర్పు ఇచ్చిన పెన్సిల్వేనియా కోర్టు.. జాకబ్‌కు మరణ శిక్ష, సారాకు యావజ్జీవ శిక్ష విధించింది.
Tags:Talle’s daughter Polality mortality

ఘోర విమాన ప్రమాదం.. 41మంది మృతి

Date:06/05/2019
రష్యా ముచ్చట్లు :

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాస్కోలోని షెరమిత్యేవో ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ముర్మాన్స్క్‌ నగరానికి బయల్దేరిన విమానంలో.. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగడంతో పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశాడు. అయితే మంటలు శరవేగంగా వ్యాపించడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఎయిర్‌ స్టీవార్డ్‌ సహా మొత్తం 41 మంది మరణించగా, దాదాపు 10 మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో 73 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

 

త్వ‌ర‌లోనే భ‌క్తుల‌కు అందుబాటులోకి సెల్లార్

Tags:At least 41 people were killed in the accident

253కు తగ్గిన శ్రీ లంక పేలుళ్ల మృతులు

Date:26/04/2019
కొలంబో ముచ్చట్లు:
కొలంబో పేలుళ్లలో దుర్మరణం పాలైన వారి సంఖ్యను తగ్గిస్తూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆదివారం (ఏప్రిల్ 21) ఈస్టర్ సందర్భంగా కొలంబోలోని పలు చర్చిలు, హోటళ్ల వద్ద జరిపిన పేలుళ్లలో మొత్తం 359 మంది మరణించినట్లు అధికారులు ఇంతకుముందు పేర్కొన్నారు. అయితే.. తాజాగా ఈ సంఖ్యను 253కు కుదించారు. దీనికి కారణాలను కూడా వివరించారు.
భయంకరమైన పేలుళ్లలో చాలా మంది పర్యాటకుల శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయని.. దీంతో అధికారులు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులుగా లెక్కించారని వివరించారు. అంతేకాకుండా మృతుల సంఖ్య విషయంలో పలు ఆస్పత్రులు కూడా సరైన గణాంకాలు ఇవ్వలేదని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా శరీర భాగాలన్నింటినీ గుర్తించిన తర్వాత పేలుళ్లలో మరణించివారి సంఖ్య 253గా తేలిందని అధికారులు తెలిపారు. కొలంబో పేలుళ్ల విషయంలో రక్షణ శాఖ వైఫల్యం ఉందని అంగీకరించిన శ్రీలంక ప్రభుత్వం.. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రదాడులకు సంబంధించి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నప్పటికీ.. అప్రమత్తమవడంలో విఫలం చెందినట్లు తెలిపారు. కొలంబోలో మొత్తం 8 ప్రదేశాల్లో ముష్కరమూకలు మారణహోమం జరిపారు. ఈ దాడుల్లో 9 మంది ఆత్మాహుతి దళ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కొలంబో పేలుళ్లకు సంబంధించి శ్రీలంక పోలీసులు మొత్తం 70 మంది అదుపులోకి తీసుకొని విచారిస్తు్న్నారు. వీరిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు. న్యూజిలాండ్ మసీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగా కొలంబోలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డట్టు ఆ దేశ రక్షణ మంత్రి ఇంతకుముందే తెలిపారు. పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ఘటనలో తన వైఫల్యం ఏదీ లేదని తెలిపారు.శ్రీలంకకు చెందిన ముస్లిం సంస్థలు.. నేషనల్ తౌహీద్ జమాత్, జమ్మియాతుల్ మిలాత్ ఇబ్రహింలకు కొలంబో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వారందరినీ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో బాగా చదువుకున్నవారు, ధనవంతులు కూడా ఉన్నట్లు తెలిపారు. శ్రీలంకలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన సుగంధద్రవ్యాల వ్యాపారి ఇద్దరు కుమారులు కూడా ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
Tags:Sri Lankan death toll rises to 253