స్మగ్లర్లను అప్రమత్తం చేసిన రామచిలుక…

-చిలుకను అరెస్ట్ చేసిన పోలీసులు
Date:26/04/2019
బ్రెజిల్ ముచ్చట్లు:
మనిషికి బాగా మచ్చికయ్యే పక్షుల్లో రామచిలుక కూడా ఒకటి. మనుషులు మాట్లాడే కొన్ని పదాలను పలకగలిగే సామర్థ్యం చిలుకల సొంతం. బ్రెజిల్ లోని ఓ రామచిలుక కూడా అలాంటిదే. అయితే ఇది తన టాకింగ్ పవర్ తో ఓ మాఫియా ముఠా పారిపోయేందుకు సహకరించడం ఆసక్తి కలిగిస్తోంది.పియావి రాష్ట్ర ముఖ్యపట్టణం విలా ఇర్మా డుల్సేలో కొకైన్ స్మగ్లింగ్ తీవ్రరూపం దాల్చడంతో అక్కడి పోలీసులకు కంటిమీద కునుకు కరువైంది. మాఫియా ముఠాలను పట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఇంటిపై దాడికి దిగారు. ఆ ఇంట్లో భారీ మొత్తంలో కొకైన్ నిల్వచేశారన్న సమాచారంతో పోలీసు బలగాలు చుట్టుముట్టాయి.అయితే, ఆ ఇంటి గుమ్మం వద్ద ఉన్న ఓ రామచిలుక వెంటనే “మామా… పోలీస్!” అంటూ అదేపనిగా అరవడం ప్రారంభించింది. చిలుక అరుపులు విన్న స్మగ్లర్లు మరో ద్వారం నుంచి పరారయ్యారు. లోపలికి వెళ్లిన పోలీసులకు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇదంతా చిలుక చేసిన నిర్వాకమేనని గ్రహించిన పోలీసులు మరేమీ ఆలోచించకుండా ఆ చిలుకను అరెస్ట్ చేశారు.క్రిమినల్స్ కు సాయపడడం కూడా నేరమేనని, ఆ విధంగా చిలుక చేసింది కూడా క్రైమ్ కిందకు వస్తుందని భావించారు. ఇన్వెస్టిగేషన్ సందర్భంగా పోలీసులు ఆ చిలుకతో ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయారట. మరోవైపు పక్షి ప్రేమికుల ఒత్తిళ్లు కూడా ఎక్కువవడంతో చేసేదిలేక దాన్ని స్థానికంగా జూ అధికారులకు అప్పగించారు.
Tags:Ramachikula alerted the smugglers …

శ్రీలంకకు మరోమారు ఉగ్రదాడులు: అమెరికా హెచ్చరిక

Date:26/04/2019
కొలోంబో ముచ్చట్లు:
శ్రీలంక దేశానికి అమెరికా సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేసి 350మందిని హతమార్చిన ఘటన నేపథ్యంలో అమెరికా రాయబార కార్యాలయం శ్రీలంకకు మరోమారు ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ వారంలో శ్రీలంకలోని ప్రార్థనాలయాలపై మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీలంక పోలీసులు అనుమానాస్పద వ్యక్తుల కోసం గాలింపు చేపట్టారు.ఈ వారంలో అంటే ఏప్రిల్ 26నుంచి 28వతేదీ ఆదివారం లోగా కొలోంబోలోని ప్రార్థనాస్థలాలకు ప్రజలు వెళ్లవద్దని అమెరికా రాయబార కార్యాలయ అధికారులు ట్విట్టర్ లో హెచ్చరించారు. ఎక్కువ మంది జనం గుమిగూడవద్దని కూడా అమెరికా రాయబార కార్యాలయం కోరింది. దేశంలో పోలీసు బందోబస్తును పెంచడంతోపాటు అనుమానితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని శ్రీలంక ప్రధానమంత్రి రాణిల్ విక్రమ్ సింఘే చెప్పారు. ఈస్టర్ పండుగ రోజు జరిగిన పేలుళ్ల కేసులో ముగ్గురు మహిళలు, ఓ యువకుడి పాత్ర ఉందని అనుమానిస్తున్నామని వారి వివరాలు అందించాలని శ్రీలంక పోలీసులు ప్రజలను కోరారు.
Tags:Sri Lankan tensions again: America warns

శ్రీలంకలో చర్చిలు మూసివేత

Date:25/04/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

శ్రీలంకలో ఇటీవల ఉగ్రమూకలు సృష్టించిన మారణకాండతో 359 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈస్టర్ రోజున చర్చిలు, విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రైస్తవ మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయమై సీనియర్ మతబోధకుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రతను పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందులో భాగంగా రక్షణ ఏర్పాట్లను కల్పిస్తున్నామన్నారు.  ఈ క్రమంలో రక్షణ శాఖ సూచన మేరకు చర్చిలను కొన్ని రోజులు మూసివేస్తున్నామని చెప్పారు. ప్రజలంతా ఈ ఆదివారం ఇళ్ల దగ్గరే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. తాము చెప్పేవరకూ ప్రజలు చర్చిలకు రావొద్దని కోరారు. శ్రీలంక ఉగ్రదాడిలో దాదాపు 500 మంది గాయపడగా, వీరిలో చాలామంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
Tags:Close churches in Sri Lanka

మరోసారి శ్రీలంకలో పేలుళ్లు

Date:25/04/2019
కొలోంబో ముచ్చట్లు:
క్రైస్తవుల పండుగ ఈస్టర్ రోజున శ్రీలంక రాజధాని  కొలోంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో నేపధ్యంలో మరోసారి గురువారం పేలుళ్లు జరిగాయి. ఆదివారం నాటి పేలుళ్లలో 359 మంది మరణించారు. దాదాపు ఐదు వందలమంది గాయాపడ్డారు.  అదృష్టవశాత్తు గురువారం ఘటనలో ఏవరూ గాయాపడలేదు.  కొలోంబోకు నలభై కిలోమీటర్ల దూరంలోని  పుగోడ మెజిస్ట్రేట్ కోర్టు దగ్గర వున్న ఖాళీ ప్రదేశంలో పేలుళ్లు జరిగాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదని, ఈ పేలుళ్లపై కొలోంబో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఆత్మాహుతి చేసుకున్న తొమ్మిదిమందిలో ఎనిమిది మందిని అధికారులు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వున్నట్లు గుర్తించారు.  ముష్కరులంతా విద్యావంతులు, ఉన్నత కుటుంబాలకు చెందినవారే.
Tags:Explosions once again in Sri Lanka

శ్రీలంకలో మరో పేలుడు

Date:24/04/2019
కొలంబో ముచ్చట్లు:
వరస పేలుళ్లతో వణికిపోతున్న శ్రీలంకలో మరో పేలుడు సంభవించింది. బుధవారం (ఏప్రిల్ 24) ఓ సినిమా థియేటర్ వద్ద ఈ పేలుడు చోటుచేసుకుంది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఓ సినిమా థియేటర్ వద్ద బాంబు అమర్చినట్లు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో నియంత్రిత పద్ధతిలో పేల్చి వేశారు. తగిన జాగ్రత్తలు తీసుకొని బాంబ్ పేల్చడంతో ఎలాంటి నష్టం జరగలేదు. సినిమా థియేటర్‌నే లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు అక్కడ బాంబు అమర్చినట్లు తెలుస్తోంది. కొలంబోని సావోయ్‌ థియేటర్‌ సమీపంలోని ఓ మోటార్‌ బైక్‌లో ఈ బాంబు అమర్చారు. బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో దాన్ని పేల్చివేశారు. శ్రీలంకలో వరస బాంబు దాడులతో ఆ దేశ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. కొలంబోలో ఆదివారం ముష్కర మూకలు జరిపిన మారణహోమం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో ఇప్పటివరకు 359 మంది దుర్మరణం పాలైనట్లు సమాచారం. 500 మందికి పైగా గాయపడ్డారు. కొలంబో పేలుళ్ల అనంతరం శ్రీలంక పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అణువణువూ క్షుణ్నంగా గాలిస్తున్నారు.
Tags:Another explosion in Sri Lanka

న్యూజిలాండ్‌ ఘటనకు ప్రతీకారమే శ్రీలంకలో పేలుళ్లు

Date:23/04/2019
కొలంబో ముచ్చట్లు:
న్యూజిలాండ్‌ మ‌సీదుల్లో కాల్పుల ఘటనకు ప్రతీకారంగానే శ్రీలంకలో ఉగ్రవాదులు మారణహోమానికి తెగబడ్డారని ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ మేరకు శ్రీలంక‌ రక్షణ మంత్రి రువాన్ విజయవర్దనే.. ఆ దేశ పార్లమెంట్‌లో మంగళవారం (ఏప్రిల్ 23) ప్రకటించారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ్‌లోని మసీదులో ఓ శ్వేతజాతీయుడు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో 50 మంది మృత్యువాతపడ్డారు. ఐసిస్ ఉగ్రవాదానికి ప్రతీకారంగానే ఈ దాడులు నిర్వహించినట్లు నాడు నిందితుడు తెలిపాడు. అయితే.. క్రైస్ట్‌చర్చ్ ఘటన అనంతరం దానికి బదులు తీసుకుంటామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అందుకు తగినట్టే శ్రీలంక రాజధాని కొలంబోలో తన ప్రణాళిక అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్)కు చెందిన వెబ్‌సైట్‌లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచార‌ణ అధికారులు గుర్తించారు. పేలుళ్ల కేసులో ఇప్పటివరకూ 24 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న శ్రీలంక పోలీసులు.. కేసులో పురోగతి సాధించారు. పేలుళ్లతో సంబంధం ఉన్న నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. దేశ ర‌క్షణ వ్యవస్థలోనూ లోపాలు ఉన్నట్లు శ్రీలంక రక్షణ మంత్రి అంగీక‌రించారు. అన్ని రకాల ఉగ్రవాద సంస్థలను రూపుమాపేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామని పార్లమెంటులో వివరణ ఇచ్చారు. మరోవైపు.. కొలంబో పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 320కి చేరింది. వీరిలో 38 మంది విదేశీయులు ఉన్నారు. మృతుల్లో భారతీయుల సంఖ్యం 10కి పెరిగింది. ఆదివారం ఈస్టర్ సందర్భంగా సరదాగా సమయం గడుపుతున్న టూరిస్టులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. మొత్తం 8 చోట్ల పేలుళ్లతో విధ్వంసం సృష్టించారు. ఆరు చోట్ల ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పేలుళ్లలో మృతి చెందిన పలువురి వివరాలు తెలియరావడంలేదు.
Tags:Blasts in Sri Lanka are a revenge for the New Zealand event

లవర్ ను అమ్మేసిన యువతి

 Date:23/04/2019
అమెరికా ముచ్చట్లు :
శుభలగ్నం’ సినిమాలో ఆమని.. తన భర్తను రూ.కోటికి అమ్మేసి సంబరాలు చేసుకున్నట్లుగా.. ఈ యువతి తన తనకు కాబోయే భర్త, ప్రియుడిని అమ్మేసింది. హమ్మయ్య.. శని వదిలిందంటూ తెగ సంబరపడిపోతోంది. ఇంతకీ అతడిని ఎవరు కొనుకున్నారనేగా మీ ప్రశ్నా? మరెవ్వరో కాదు.. అతడి తల్లిదండ్రులే. ఈ విచిత్రమైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. రెడిట్’ అనే సోషల్ న్యూస్ ప్లాట్‌ఫాంలో ఓ యువతి తన పేరు వెల్లడించకుండా ఈ ఘనకార్యాన్ని చెప్పుకొచ్చింది. కాలేజీ రోజుల్లో పరిచయమైన అతడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నానని, ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. సంపన్నులైన అతడి తల్లిదండ్రులకు తనంటే ఇష్టం లేదని, వాళ్ల కొడుకు తనని పెళ్లి చేసుకోకూడదని వారించారు. ఎంగేజ్మెంట్ తర్వాత అతడిలో కూడా చాలా మార్పు కనిపించిందని ఆమె తెలిపింది. ‘‘అతడు నాపై అతిగా పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. రోజూ నేను ఎక్కడ ఉంటున్నా.. ఎక్కడ తిరుగుతున్నా అంటూ ఆరా తీసేవాడు. పెళ్లి తర్వాత నేను ఏ సమయంలో ఎక్కడ ఉంటానో తెలుపుతూ షెడ్యూల్ తయారు చేయాలన్నాడు. దీంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. అప్పుడే అతనితో పెళ్లి అవసరమా అనిపించింది. అంతేగాక అతడు పెద్ద తాగుబోతు. తాగితే మనిషే కాదు’’ అని తెలిపింది. అతడిని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో అత్త ఫోన్ చేసింది. తన కొడుకును వదిలేస్తే 10 వేల డాలర్లు (రూ.6,96,860) ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. ఎలాగో వదిలేయాలని అనుకున్నా కాబట్టి.. ఆ డబ్బులేవో తీసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని భావించాను. ఆమె చెప్పిన షరతులకు ఒప్పుకున్నా. ఈ విషయం అతడి కొడుకుకు తెలియకుండా ఇద్దరం ఒప్పందం చేసుకున్నాం. ఆ తర్వాత నేను లగేజ్ సర్దుకుని, అతడికి బ్రేకప్ చెప్పేసి.. బయటకు వచ్చేశా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది’’ అని పేర్కొంది.చివరిలో ‘‘నేను చేసింది తప్పా? ఒప్పా?’’ అని రెడిట్‌లో ప్రశ్నించింది. దీనిపై కొందరు ‘‘మంచి పని చేశావ్.. వస్తూ వస్తూ బాగానే సంపాదించావుగా’’ అని అంటే, ఇంకొందరు.. ‘‘ప్రేమకు ఇచ్చే విలువ ఇదేనా? కనీసం అతడి ఫీలింగ్స్ కూడా తెలుసుకోకుండా అలా ఎలా వదిలేస్తావ్?’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ‘‘అతన్ని నేను వదిలేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే నాకు ఈ ఆఫర్ వచ్చింది. కానీ, డబ్బు కోసం అతడిని విడిచిపెట్టలేదు’’ అని సమాధానం ఇచ్చింది.
Tags:A young woman who sold Lover

కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను లోబరుచుకుంది

Date:23/04/2019
కాలిఫోర్నియా  ముచ్చట్లు :
ఓ మహిళ తన కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను లోబరుచుకుంది. 21 సార్లు వారితో సెక్స్‌లో పాల్గొని ఊచలు లెక్కిస్తోంది. కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కరాల్ లైటిల్ అనే 41 ఏళ్ల మహిళకు ఇద్దరు టీనేజ్ కుమార్తెలు ఉన్నారు. వారిద్దరు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను తల్లిదండ్రులకు పరిచయం చేశారు. అప్పటి నుంచి వారి బాయ్‌ఫ్రెండ్స్ నిత్యం ఇంటికి వచ్చి వెళ్తుండేవారు. ఈ సందర్భంగా లైటిల్‌కు వారితో పరిచయం ఏర్పడింది. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్న లైటిల్‌.. ఆ ఇద్దరితో కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా వారిని లోబరుచుకుని తన లైంగిక కోరికలు తీర్చుకొనేది. తన కారులో విసేలియాకు తీసుకెళ్లి మందు, సిగరెట్లు ఇచ్చి వారితో ఆ పని కానిచ్చేది. ఆ ఇద్దరిలో ఒక కుర్రాడు ఆమెతో సెక్స్‌ చేయడం ఇష్టం లేక తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. లైటిల్ భర్త ఎంతో మంచివాడని, అతన్ని మోసం చేస్తున్నా అనే పశ్చాతాపంతో ఆ యువకుడు లైటిల్ ఇంటికి వెళ్లడం మానేశాడు. అయితే, లైటిల్ మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు. ఇంటికి వచ్చి తనతో గడపాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చేది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయ్యింది. ఆ కుర్రాళ్లిద్దరూ 14, 15 ఏళ్ల టీనేజర్లే కావడంతో కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లైటిల్‌కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసిన తర్వాత లైటిల్ కుమార్తెలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆమె భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
Tags:The boyfriends are locked in boyfriends