జియో ప్రతిపాదనకు సుప్రీం నో

Date:17/04/2018

ముంబై  ముచ్చట్లు:

అంబానీ సోదరులకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. అనిల్‌ అంబానీకి చెందిన ‘రిలయెన్స్‌ కమ్యూనికేషన్‌ను కొనుగోలు చేయాలన్న ముకేశ్‌ అంబానీకి చెందిన ‘రిలయెన్స్‌ జియో’ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు బ్రేక్‌ వేసింది. ఈ ఆస్తుల విక్రయానికి ‘నేషనల్‌ కంపెనీలా ట్రిబ్యునల్‌’ ఇచ్చిన ఆర్డర్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌‌కాం టవర్‌ సంస్థలో 4 శాతం వాటా ఉన్న హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. రిలయెన్స్ కమ్యూనికేషన్స్‌కు వైర్‌లెస్, టవర్, ఆప్టిక్ ఫైబర్‌కు సంబంధించిన ఆస్తులను దాదాపు రూ.24,000 కోట్లకు రిలయెన్స్ జియోకు అమ్మాలని గతేడాది డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో టవర్,ఫైబర్ ఆస్తులే రూ.8000 కోట్ల వరకు ఉంటాయి.ఈ ఒప్పందంపై ‘హెచ్‌ఎస్‌బిసి డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌’ సంస్థ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా అనిల్ అంబానికే తీర్పు అనుకూలంగా వచ్చింది. అయితే హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రంయించగా… ఈ మేరకు అపెక్స్ కోర్టు ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

Tags:

 కధువా ఘటన లాయర్ సంచలన వ్యాఖ్యలు

Date:16/04/2018
శ్రీనగర్  ముచ్చట్లు:
కథువాలో 8 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో బాలిక కుటుంబం తరఫున వాదిస్తున్న లాయర్ దీపికా రాజావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కూడా రేప్ చేసి, హత్య చేస్తారేమోనని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. తనకు తగిన రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరనున్నట్లు దీపికా చెప్పారు. నేను ఎన్ని రోజులు బతికుంటానో నాకు తెలియదు. నన్ను కూడా రేప్ చేసి చంపేయొచ్చు. నాపై దాడి జరగొచ్చు. నిన్ను ఎప్పటికీ క్షమించం అంటూ నాకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను ప్రమాదంలో ఉన్నట్లు సుప్రీంకోర్టుకు చెబుతా అని దీపికా అన్నారు. తమ కుటుంబానికి ముప్పు పొంచి ఉండటంతో కేసు విచారణను చండీగఢ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ పాప తండ్రి ఇవాళ సుప్రీంకోర్టును కోరారు. కథువాలో విచారణకు అనుకూల వాతావరణం లేదు అని దీపికా చెప్పారు. ఈ దారుణ ఘటనపై దేశమంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రేప్, హత్య కేసులో ఆరుగురు నిందితులుగా ఉన్నారు. ఆ పాపను కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించి కొన్ని రోజుల పాటు అత్యాచారం చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులపైనా కేసులు నమోదు చేశారు. ఈ కథువా గ్యాంగ్‌రేప్‌లో మాజీ రెవెన్యూ అధికారి సాంజీరామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జనవరి 10న ఈ ఘటన జరగగా.. అదే నెల 17న ఆ పాప మృతదేహం దొరికింది. అయితే ఆ తర్వాత ఈ రేప్ కేసుకు మతం రంగు పులుముతూ హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో జమ్ముకశ్మీర్‌కు చెందిన ఇద్దరు బీజేపీ మంత్రులు పాల్గొనడం సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో ఆ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు.
Tags;Kadhava incident Lawyer sensational comments

రిజర్వాయర్ లలో  పడిపోతున్న నీటి నిల్వలు

DAte:14/04/2018
న్యూఢిల్లీముచ్చట్లు:
భారత దేశంలో తాగునీటికి కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. ఉపగ్రహాలు పంపిన చిత్రాల ఆధారంగా అమెరికాకు చెందిన నీటి వనరుల సంస్థ  ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతపై అధ్యయనం జరిపింది.  దక్షిణాఫ్రికాలో వరుసగా మూడేండ్లుగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో ఆ దేశంలోని లక్షల మంది ప్రజలు తాగునీటి కోస అల్లాడుతున్నారు. ఇటీవలే కేప్‌టౌన్‌లో తాగునీటి కొరత ఉన్నదని అధికారికంగా ప్రకటించారు. భారతదేశంతోపాటు దక్షిణాఫ్రికా, మొరాకో, ఇరాక్, స్పెయిన్ తదితర దేశాల్లో తీవ్రమైన తాగునీటి కొరత పరిస్థితులు తలెత్తాయి. నీటి వినియోగంలో నిర్లక్ష్యం, వృథాగా నీటిని వదిలేయడం.. భారతదేశంలోని రిజర్వాయర్లు, డ్యామ్‌లు పూర్తిగా అడుగంటడంతోపాటు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నదన్న విమర్శ వినిపిస్తున్నది. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల మధ్య ప్రవహిస్తున్న నర్మదా నదిపై నిర్మించిన రెండు రిజర్వాయర్ల నుంచి నీటి కేటాయింపుల తీరుపై ఆయా రాష్ర్టాల ప్రజల మధ్య ఉద్రిక్తతలు తలెత్తే ముప్పు పొంచి ఉన్నదని ఈ అధ్యయనం హెచ్చరించింది. గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ దిగువన నీటి నిల్వలు పడిపోవడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీని పరిధిలోని మూడు కోట్ల మందికి పైగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. సర్దార్ సరోవర్ డ్యామ్ పరిధిలోని రైతులంతా పంటలు సాగు చేయొద్దని కోరిన గుజరాత్ ప్రభుత్వం.. గత నెలలో సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వర్షాభావ పరిస్థితులతో మధ్యప్రదేశ్‌లోని ఇందిరాసాగర్ డ్యామ్‌లో నీటి నిల్వలు సీజనల్ స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.మూడేండ్లుగా నెలకొన్న వర్షాభావంతో మొరాకోలో గల రెండో అతిపెద్ద రిజర్వాయర్ అల్ మాస్సిరా రిజర్వాయర్‌లో నీటి నిల్వలు 60 శాతానికి పైగా తగ్గిపోయాయి. అల్ మస్సిరా రిజర్వాయర్ పొరుగున ఉన్న కాసాబ్లాంకా వంటి నగరాల పరిధిలో పంటల సాగు విస్తీర్ణం పెంచడం కూడా ఈ దుస్థితి కారణాల్లో ఒకటి. మరోవైపు ఐదేండ్లుగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న స్పెయిన్‌లోని బెండి యా డ్యామ్‌లో 60 శాతం నీటి నిల్వలు తగ్గాయి. తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇరాక్‌లోని మోసుల్ డ్యామ్ 1990 నాటి నీటి నిల్వలతో పోలిస్తే 60 శాతం నీటినిల్వలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు మెరుగైన నీటి నిర్వహణ యాజమాన్య పద్ధతులను అమలు పరుచాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల రిజర్వాయర్లలో నీటి నిల్వలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి.
TAgs:Water reserves falling in reservoirs

బీజేపీలో అంతర్మధనం…

-చంద్రబాబుతో వైరంపై సంఘ్ క్లాస్
Date:14/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఢిల్లీ నడిబొడ్డులో మోడీని చంద్రబాబు కడిగివేసిన వీడియోలు ఇప్పుడు బిజెపి నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయట. అసలు చంద్రబాబుతో వైరం దేనికి? బాబుతో వైరం తెచ్చుకున్నా మధ్యలో అయినా రాజీ చేసుకుంటే పోయేది కదా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.ఎక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకోంటుంది కమలం పార్టీ.  భవిష్యత్ లో  పరాజయాలు ఎదురుకాకుండా.. చర్యలకు రెడీ అవుతోంది. మోడీ, అమిత్ షా వైఖరి పట్ల.. అద్వానీ లాంటి సీనియర్లు.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో..పునరాలోచనలో పడింది.  ప్రస్తుతం పార్టీలో గ్రామస్థాయి నుంచి స్టేట్ లెవల్ వరకు అంతర్గత ఎన్నికలు జరుగుతున్నాయి. చంద్రబాబునాయుడుతో వైరం పెట్టుకుని జాతీయ స్థాయిలో పరువు తీసుకున్న తర్వాత ఆర్ ఎస్ ఎస్  రంగం లోకి దిగాక కాని తత్త్వం బోధ పడలేదట. అనవసరం గా తెగే వరకు లాగటం దేనికి అని సంఘ్ పెద్దలు క్లాస్ తీసారట. ఇప్పుడు జాతీయ స్థాయిలో పరువు పోయిందని, దీనివల్ల బిజెపికి దేశ స్థాయి లో నష్టం జరిగిందని చెప్పారు. చంద్రబాబు నాలుగుమెట్లు పైకి ఎకబాగి దేశస్థాయిలో మోడీకి తానే సరైన ప్రత్యర్థిని అని రుజవు చేసుకున్నారు. ఇదంతా మోడీ చేజేతులారా చేసుకున్నది కాదా అని ప్రస్నిన్చారట. చంద్రబాబుతో సామరస్యంగా వ్యవహరిస్తే ఆయన చాలా ఉదారంగా ఉండేవారని అదే సమయంలో ఆంధ్రాకు ఇచ్చిన హామీల్లో కొన్నిటినైనా నెరవేర్చి ఉంటే చంద్రబాబు సంతోషంగా మోడీతోనే సర్దుకుపోయేవారని వ్యాఖ్యానించారు. అసలు ఏమీ చేయకుండానే చంద్రబాబును అదుపులో పెట్టుకోవాలన్న ఆతృతే మోడీ కొంప ముంచిందని ఆయన అన్నారు. ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి ఆంధ్రా రాజధాని అమరావతిలో పర్యటించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి నిధుల గురించి చెప్పి ప్రజలను ఆకట్టుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని అన్నారట.చంద్రబాబు ఢిల్లీలో ప్రదర్శించిన వీడియోలు దేశవ్యాప్తం గా చర్చనీయం అయ్యి మోడీ విశ్వసనీయతకి, బిజెపికి దెబ్బ పడింది అని చెప్పారట.ఎప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి ఎసరు తెస్తారనే ఆలోచన వల్లే బాబుతో మోడీ వైరం కొని తెచ్చుకున్నారని ఆర్‌ ఎస్ ఎస్  వర్గాలు విశ్లేషించాయి. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తిలేదని చంద్రబాబు పదే పదే చెప్పినా ప్రధాని మోడీ పట్ల సంపూర్ణ విధేయత చూపినా మోడీకి ఉన్న అనుమానమే ఇప్పటి పరిస్థితికి కారణం అని వారు ఖచ్చితంగా చెప్పారట.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును తొక్కివేస్తే తనకు జాతీయ స్థాయిలో ఎదురే లేకుండా ఉంటుందన్న ఆలోచనే చంద్రబాబుతో వైరానికి మోడీని ఉసిగొల్పిందనే మాట వినిపిస్తోంది. వివిధ ఆర్థిక నేరాలతో సంబంధాలు ఉన్న ఎంపి విజయసాయిరెడ్డిని దగ్గరకు తీసి చంద్రబాబుపై ఉసిగొల్పి ఆయన పరువు తీయాలని ప్రయత్నం చేసినా అవి ఫలించకపోగా ఆ అవినీతి బిజెపి కి అంటుకుందని చెప్పారట. చివరకు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసం పెట్టె దాకా లాగటం ఓకే తప్పు అయితే, సమాధానం చెప్పలేక పారిపోవాల్సిన పరిస్థితి రావటం కావాలని చేసుకున్నదే అని చెప్పారట. రాజధాని అమరావతికి సహాయం చేసి తన పేరును చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారని ఇప్పుడు కాకపోయినా రేపైనా చంద్రబాబు రాజధాని నిర్మిస్తారని ఆ రాజధానిలో మాత్రం మోడీ పేరు ఉండదని ఐదేళ్లు ప్రధానిగా ఉన్న వ్యక్తి చంద్రబాబుతో వైరం పెట్టుకోకపోయి ఉండే మరో ఐదేళ్లు ప్రధానిగా ఉండేవారని కానీ అనవసర అహంభావం, అసూయతో వచ్చిన అవకాశాన్ని మోడీ చేజేతులారా పాడు చేసుకున్నారని, కేవలం మోడీ షా తప్పుల వల్ల దేశ వ్యాప్తం గా కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఘంటా పధం గా చెప్పారట. ఊహించని ఈ షాక్ తో ఆలోచనలో పడ్డ మోడీ అనవసరం గా చంద్రబాబు తో పెట్టుకున్నాం అని మధనపడుతున్నారని సమాచారం. మరో వైపు ధారణంగా బీజేపీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ జోక్యం ఉంటుంది కానీ… ఆర్ఎస్ఎస్ వ్యవహారాల్లో మాత్రం బీజేపీ జోక్యం పెద్దగా ఉండదు. ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాలను బీజేపీ పెద్దలు పాటిస్తుంటారు. కానీ ప్రస్తుతం బీజేపీని పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్న నరేంద్రమోదీ… మెల్లిమెల్లిగా ఆర్ఎస్ఎస్ ను కూడా తన అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజానికి బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా ఉండటం ఆర్ఎస్ఎస్ వర్గాలకు ఏ మాత్రం ఇష్టంలేదు. కానీ మోదీ ఒత్తిడి కారణంగానే అమిత్ షా ఆ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఎప్పటికైనా ఆర్ఎస్ఎస్ కారణంగా తన పదవికి ముప్పు ఉంటుందని భయపడుతున్న నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్ లోని కీలక పదవుల్లోనూ తనకు అనుకూలంగా ఉండే వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నారని… ఆ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా చేశారని ఆర్ఎస్ఎస్ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి.
TAgs:Inventive in BJP

మోడీకి నాలుగేళ్లలో ఎంతో తేడా

Date:14/04/2018
న్యూఢిల్లీముచ్చట్లు:
2014 ఎన్నిక‌ల్లో దేశంలో ప్ర‌భంజ‌నం సృష్టించిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, గుజ‌రాత్ మాజీ సీఎం న‌రేంద్ర మోడీ.. అప్ప‌ట్లో భారీ విజ‌యం న‌మోదు చేశారు. ఇంత‌లా నాలుగేళ్ల కింద‌ట ప్ర‌భంజ‌నం సృష్టించిన న‌రేంద్ర మోడీ.. ప‌రిస్థితి ఇప్పుడు ఏమైంది? ఆయ‌న అప్ప‌ట్లో ఎంత భారీ విజ‌యం న‌మోదు చేశారో.. ఇప్పుడు అంత‌కంటే ఓ రెండు పాళ్లు భారీ వైఫ‌ల్యాన్ని, ఫెయిల్యూర్‌ను న‌మోదు చేస్తున్నారా? అనే చ‌ర్చ దేశ వ్యాప్తంగా జ‌రుగుతోంది. దేశంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్లు.. ఆయ‌న హ‌వాకు తిరుగులేదు. ఆయ‌న పేరుకు తిరుగులేదు. అయితే, రానురాను ఆయ‌న తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ఆయ‌న‌కే బూమ రాంగ్ మాదిరిగా త‌గులుకున్నాయిదేశంలో ఇక‌, జాతీయ పార్టీల‌కు నూక‌లు చెల్లాయ‌ని, ప్రాంతీయ పార్టీల‌తో అంట‌కాగితే త‌ప్ప కేంద్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అనుకున్న త‌రుణంలో మోడీ విజృభించారు. మేజిక్ ఫిగ‌ర్‌కు మ‌రో నాలుగు అంకెలు ఎక్కువ‌గానే ఎంపీల‌ను సాధించుకున్నారు. మిత్ర‌ప‌క్షాల్లో బీజేపీకి నాడు వాజ్‌పేయ్‌, అద్వానీ టైం నుంచి ఎంతో న‌మ్మ‌దిగిన మిత్రులుగా ఉన్న టీడీపీయే కాదు… మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన సైతం మోడీ పేరు చెపితే మండిప‌డుతోంది. ఎంత దారుణం అంటే వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌రిగితే 7 సిట్టింగ్ ఎంపీ సీట్ల‌ను బీజేపీ కోల్పోయింది. ఈ ప‌రిణామాల‌కు తోడు పార్ల‌మెంటులో ఇటీవ‌ల జ‌రిగిన అవిశ్వాసం ర‌గ‌డ మ‌రింత‌గా ప్ర‌ధాని మోడీని దౌర్బ‌ల్యుడిగా లెక్క‌గ‌ట్టేలా చేసింది. అవిశ్వాసంపై చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టిస్తూనే త‌మిళ‌నాడు ఎంపీల ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఉభ‌య స‌భ‌ల‌ను వాయిదా వేసిన తీరుకు దేశంమొత్తం నివ్వెర‌పోయేలా చేసింది.దీంతో ఒక్క‌సారిగా దేశం మొత్తం నివ్వెర పోయింది. నీ కంటే పొడిచే మొన‌గాడే లేడంటూ.. పొగ‌డ్త‌లు కురిపించింది. ఎక్క‌డి వెళ్లినా మోడీని చూసేందుకు, మోడీతో క‌ర‌చాల‌నం చేసేందుకు కూడా ప్ర‌జ‌లు ఎగ‌బ‌డ్డారు. మోడీ.. మోడీ.. అంటూ యూత్ కూడా అదే జ‌పం చేశారు. న‌మో.. అనే సాస్కృతిక ప‌దం కూడా న‌రేంద్ర మోడీగా మారిపోయింది.ఆయ‌నతో మిత్ర ప‌క్షాలుగా నాలుగేళ్లు మెలిగి, కేంద్రంలో ప‌ద‌వులు సైతం పంచుకున్న చంద్ర‌బాబు పార్టీ ఇప్పుడు అదే మోడీకి వ్య‌తిరేకంగా క‌ర్ణాట‌క‌లో చ‌క్రం తిప్పుతుండ‌డం బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. కేంద్రంలో మోడీ గ‌ట్టిగా ఉన్నాడ‌ని, దేశ వ్యాప్తంగా త‌మ‌దే హ‌వా అని అనుకున్న నేత‌ల‌కు ఇప్పుడు అనూహ్య ప‌రిణామాలు ఎదురుకావ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై మోడీ వెనకడుగు వేశారని, ఆయ‌న‌కు ప్ర‌భుత్వాన్ని న‌డిపే స‌త్తా లేద‌ని కూడా విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా ఇటీవ‌ల ముగిసిన పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు చేసిన ఆందోళ‌న‌ల‌కు నిర‌స‌న‌గా ఒక‌రోజు దీక్ష చేప‌ట్టి మ‌రింత ప‌లుచ‌న య్యారు. ప్ర‌భుత్వాన్ని న‌డ‌పాల్సిన ప్ర‌ధానే నిర‌స‌ల‌కు దిగ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం కావ‌డంతో రాజ‌కీయంగా ఇది పెను సంచ‌ల‌నంగా మారింది. ఏదేమైనా.. మ‌రో ఏడాదిలో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉన్న స‌మయంలో ప్ర‌ధాని మోడీ వేస్తున్న రాజ‌కీయ అడుగులు బీజేపీని ప‌లుచ‌న చేస్తున్నాయి. మ‌రో ప‌దిహేను ఇర‌వై రోజుల్లో క‌ర్ణాట‌క ఎన్నిక‌లు కూడా ఉన్న నేప‌థ్యంలో బీజేపీకి వేటు వేయించేలా ఆయ‌న వ్య‌వ‌హార శైలి లేద‌నేది కొంద‌రి భావ‌న‌.మొత్తంగా మోడీ రాజ‌కీయంగా వేస్తున్న అడుగులు ఆయ‌న‌ను విజ‌యం దిశ‌గా కంటే.. విఫ‌ల‌మైన నాయ‌కుడిగా మారుస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.
Tags:Modi is very different in four years

తిరుపతిని వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయడం దురదృష్టం.- బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి.

Date:13/04/2018

తిరుమల ముచ్చట్లు:

తిరుపతి నగరాని వాణిజ్య ధృక్పదంతో అభివృద్ధి చేస్తుండడం దురదృష్టకరమన్నారు తెలంగాణా బిజేపి ఎమ్మేల్యే కిషన్ రెడ్డి…శ్రీవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వచ్చిన ఆయన శుక్రవారాభిషేక సేవలో పాల్గొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు, అనంతరం హుండిలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు…కోట్లాదిమంది భక్తులకు సంభందించిన తిరుపతి, తిరుమల ప్రాంతాలలో అభివృద్ధి అనేది ధనార్జన కోసం కాకుండా ఆధ్యాత్మికతను పెంపొందించేలా ఉండాలని ఆయన సూచించారు.

Tags: Misfortune to develop Tirupati as a commercial center – BJP MLA Kishan Reddy

తిరుమలలో తెలంగాణ డిజిపి మహేంధర్‌రెడ్డి

Date:13/04/2018

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారిని తెలంగాణా పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు..నిన్న రాత్రి తిరిమల వచ్చిన ఆయన ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలసి ఆలయంలోకి వెళ్లి గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు, అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో పండుతులు వేదాశీర్వాచనం అందజేయగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు..తిరుమల కొండపై భద్రతాపరంగా పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధివిధానాలు, పద్ధతులను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 

Tags: Telangana DGP Mahendur Reddy in Thirumala

 బ్రిటిష్ మాజీ ప్రధాని టోని బ్లేయిర్ తో చంద్రబాబు భేటీ

Date:13/04/2018
సింగపూర్  ముచ్చట్లు:
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో విడిగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు టోనీ బ్లెయర్ ను ఏపీ సందర్శనకు ఆహ్వానించారు. ఏపీ పర్యటనకు టోనీ బ్లెయర్ కూడా ఆసక్తి చూపారు. ఒకప్పటి తన హైదరాబాద్ సందర్శనను, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్ నగర్లోని ఒక గ్రామాన్ని పరిశీలించిన వైనాన్ని టోనీ బ్లేయర్ గుర్తుచేసుకున్నారు. కొత్త రాష్ట్రం ఎలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగి తెలుసుకున్ఆరు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో ఎలా భూములు అందించిందీ తదితర విషయాఅను టోని బ్లేయిర్ కు ముఖ్యమంత్రి వివరించారు.  పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, వచ్చే 15, 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న వైనం, ఫైబర్ కనెక్టివిటీ, ఆహార శుద్ధి రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను బ్లేయర్ కు  వివరించారు. 1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమని  బ్లేయర్ ఆశ్చర్యం వ్యక్తంచేసారు.రియల్టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను కుడా బ్లేయర్ కు చంద్రబాబు వివరించారు.
Tags:Chandrababu met with former British Prime Minister Tony Blair