రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై లలిత్‌ మోదీ మండిపాటు

Date:19/04/2019
లండన్ ముచ్చట్లు:
మోదీ పేరున్న వారంతా దొంగలేనంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనను బ్రిటన్‌ కోర్టుకు లాగుతానని లలిత్‌ మోదీ హెచ్చరించారు. లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీలను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని, ఇంకా ఎంత మంది ఇలాంటి మోదీలు బయటికొస్తారో మనకు తెలియదని మహారాష్ట్రలో ఇటీవల ఓ ర్యాలీలో రాహుల్‌ వ్యాఖ్యలు దుమారం రేపాయి.రాహుల్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో తాను కోర్టును ఆశ్రయిస్తానని లలిత్‌ మోదీ ట్వీట్‌ చేశారు. ఐదు దశాబ్ధాల పాటు భారత్‌ను రాహుల్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఎవరు దొంగో..ఎవరు కాపలాదారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌గా వ్యవహరించిన లలిత్‌ మోదీ తనపై మనీల్యాండరింగ్‌ ఆరోపణలు రావడంతో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారు.మోదీలందరూ దొంగలని చెబుతున్న రాహుల్‌ గాంధీపై బ్రిటన్‌ కోర్టులో తాను కేసు వేస్తానని లలిత్‌ మోదీ హెచ్చరించారు.మరోవైపు తనపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. మోదీల పేరున్న వారంతా దొంగలేనంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు బీసీలను అవమానించడమేనని దుయ్యబట్టారు.
Tags:Lalit Modi blames Rahul’s remarks

బస్సు ప్రయాణికులఫై ఆగంతకులకాల్పులు

Date:18/04/2019
ఇస్లామాబాద్  ముచ్చట్లు:
పాకిస్థాన్ బలూచిస్థాన్ లో ఘోరం జరిగింది. గురువారం సాయుధులైన ఆగంతకులు జరిపిన కాల్పుల్లో 14మంది బస్సు ప్రయాణికులు మరణించారు. పాక్ దేశంలోని బలోచిస్థాన్ పరిధిలోని మక్రాన్ కోస్తా జాతీయ రహదారిపై సాయుధులైన 20 మంది దుండగులు కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిపై కరాచీ – గ్వాదర్ నగరాల నుంచి రాకపోకలు సాగిస్తున్న ఆరు బస్సులను నిలిపివేసి ప్రయాణికులను గుర్తింపు కార్డులడిగారు. వారిలో పదహారు మందిని కిందకు దింపి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది ప్రయాణికులు మరణించగా, మరో ఇద్దరు గాయాలతో తప్పించుకున్నారు. వారు   ఒర్మారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 12 మంది దుండగులు  మిలటరీ దుస్తుల్లో వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నౌకదళ అధికారులు, తీర ప్రాంత సిబ్బంది లక్ష్యంగా దాడి చేసినట్లు సమాచారం.  మృతుల్లో ఒకరు నేవీ అధికారి, మరోకరు కోస్టు గార్డు జవానుగా గుర్తించారు.
Tags:The bus passenger

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Date:11/04/2019
ముంబై ముచ్చట్లు:
ఇండియన్ స్టాక్ మార్కెట్ గురువారం స్వల్ప లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 22 పాయింట్లు లాభపడింది. 38,607 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,597 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండంతో పాటు, తొలిదశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. వీటికి తోడు మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను అప్రమత్తత చేయడంతో సూచీలు స్వల్ప లాభాలను సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గెయిల్, ఎస్‌బీఐ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ 1 శాతానికి పైగా పెరిగింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు దాదాపు 2 శాతం లాభపడ్డాయి. అదేసమయంలో వేదాంత, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. వేదాంత దాదాపు 3 శాతం పడిపోయింది.
Tags:Marks ending in profits

 వికిలీక్స్ అసాంజే అరెస్ట్

Date:11/04/2019
 లండన్ ముచ్చట్లు:
న్నేళ్ల క్రితం వికీలీక్స్ పేరిట దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జూలియన్ అసాంజే ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వివిధ దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలు, దేశ రహస్యాలను అసాంజే తన వికీలీక్స్ సంస్థ ద్వారా బట్టబయలు చేశారు. దాంతో అనేక దేశాలు ఆయనపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నాయి. అయితే, కొన్నాళ్ల కిందట అసాంజేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో స్వీడన్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నించారు. ఆ కేసుకు భయపడి అసాంజే ఏడేళ్లుగా లండన్ లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. అసాంజే ఓ శరణార్థిలా కాకుండా ఇష్టంవచ్చిన రీతిలో వ్యవహరిస్తూ అంతర్జాతీయ ఒడంబడికలకు తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుండడంతో ఈక్వెడార్ అధికారులు అతడికి ఇచ్చిన ఆశ్రయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో, బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ప్రవేశించి అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. యూకేలో అతడిపై న్యాయవిచారణ జరుగుతుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.
Tags:WikiLeaks Assange arrest

 మోడీమళ్లీ భారత్ కు  ప్రధానమంత్రి కావాలి

Date:010/04/2019

ఇస్లామాబాద్ ముచ్చట్లు :
ఒకవైపు పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రధానమంత్రి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తుండగా,నరేంద్రమోదీయే మళ్లీ ప్రధానమంత్రి కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరుకుంటున్నారు. మోదీ మళ్లీ అధికారం చేపడితే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ఎక్కువగా జరుగుతాయని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఒక వేళ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కశ్మీర్ పరిష్కారం కోసం పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భయపడొచ్చు. కారణం దానికి రైట్‌ వింగ్‌తో ఇబ్బందులు ఎదురవుతాయి. అదే బీజేపీ అయితే హిందుత్వ పార్టీయే కాబట్టి మోదీ అధికారంలోకి వస్తే కశ్మీర్‌కు సంబంధించిన కొన్ని విషయాల్లో తొందరగా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అని పేర్కొన్నారు..అయితే ఇప్పుడు ఇండియాలో రాజకీయాలు ఎలా ఉన్నాయో, అసలు ఏం జరుగుతుందో తనకు తెలియదని ఇమ్రాన్ అన్నారు. ఇండియాలో ఎన్నో ఏళ్లుగా సురక్షితంగా ఉన్న విషయం ముస్లింలకు తెలుసని ప్రస్తుతం పెరిగపోయిన విపరీత హిందుత్వ జాతీయవాదాన్ని వారు పసిగట్టారని చెప్పారుబీజేపీ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయని కాంగ్రెస్ భావించి పాకిస్థాన్ తో ఒప్పందాలకు కాంగ్రెస్ వెనుకాడుతుందని ఆయన అన్నారు.. కశ్మీర్‌లో ఎన్నో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ ను బీజేపీ రద్దు చేస్తాననడంపై కశ్మీర్‌లో ఆందోళన పరిస్థితులను రెచ్చగొడుతోందని అన్నారు. కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఘటనను ఆయన ఖండించారు. పాకిస్తాన్‌కు చెందిన తీవ్ర వాద సంస్థ జైషే మహ్మద్.. తమ పనేనని చెప్పింది. అయితే ఆ ఘటనకు పాకిస్తాన్ బాధ్యత వహించలేదని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.
Tags:Modi needs Prime Minister of India

 మోడీకి అరబ్ ఏమిరేట్స్ అత్యున్నత పురస్కారం

 Date:04/04/2019

దుబాయ్ ముచ్చట్లు :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్‌తో ప్రధాని మోదీని సత్కరించాలని నిర్ణయించింది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ ఈ అవార్డును మోదీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. ఇండియా, యూఏఈ మధ్య సంబంధాలను బలోపేతం చేసిన కారణంగా మోదీకి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. వాటిని మోదీ మరోసారి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయను యూఏఈ అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించారు అని క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.మోదీ కంటే ముందు ఈ ప్రతిష్టాత్మక అవార్డును రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (2007), చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (2018), సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ (2016) అందుకున్నారు. గత నాలుగేళ్లలో రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా మెరుగయ్యాయి. ప్రధాని అయిన తర్వాత మోదీ తొలిసారి 2015 ఆగస్ట్‌లో యూఏఈ పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత 2016లో క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఇండియాకు వచ్చారు. 2018లో మోదీ మరోసారి యూఏఈ వెళ్లారు. దుబాయ్‌లో జరిగిన ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా మోదీ హాజరయ్యారు.
Tags:Modi is the highest award given to Arab Indians

తమిళనాడులో ఎన్నికల పోరు

 Date:02/04/2019

చెన్నై ముచ్చట్లు :
తమిళనాడులో ఎన్నికల పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు శక్తి వంచన లేకుండా గెలుపుకోసం కృషి చేస్తున్నాయి. రెండు పార్టీలకు జనాకర్షణ గల నేత లేకపోవడం ఈ ఎన్నికల విశేషంగానే చెప్పుకోవాలి. అధికార అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో పన్నీర్ సెల్వం, పళనిస్వామిలే ఆ పార్టీ కి మెయిన్ ఫేస్ గా మారారు. ఇక డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి మరణంతో స్టాలిన్ పార్టీ పగ్గాలు అందుకున్నా తండ్రి అంతటి ఛరిష్మా లేదన్నది వాస్తవం.
ఇద్దరూ లేకుండా…..
కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు హోరాహోరీ తలపడుతున్నాయి. జయలలిత, కరుణానిధి కొన్నేళ్లుగా సాధించి పెట్టిన ఓటు బ్యాంకుపైనే వీరు నమ్మకం పెట్టుకున్నారనడంలో అతిశయోక్తి లేదు. పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు జనాన్ని పెద్దగా ప్రభావం చేయలేరు. ఇక డీఎంకే కూడా కరుణానిధి అంతటి సమర్థ నాయకుడు స్టాలిన్ కాదన్నది ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం.
దీంతో ప్రజలు ఎవరివైపు మొగ్గుతారన్నది తమిళనాట ఆసక్తిగా మారింది.అయితే ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏడాదిన్నర క్రితం మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ తరుపున అభ్యర్థులను కమల్ హాసన్ బరిలోకి దించారు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ కమల్ హాసన్ మాత్రమే. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కమల్ హాసన్ ఏ మేరకు ఓట్లను చీల్చగలుతారు? ఎవరిని దెబ్బకొడతారన్న చర్చ తమిళనాట జోరుగా జరుగుతోంది.తమిళనాడులో 40 లోక్ సభ స్థానాలు, 18 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొత్త వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారు. మార్పుకోసమే తాను వచ్చానని చెబుతున్న కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్థులుగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనివారిని ఎంపిక చేయడం కొంత కలసి వస్తుందంటన్నారు. అభ్యర్థుల్లో ఎక్కువగా రిటైర్డ్ అయిన ఐఏఎస్ అధికారులు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆరోపణలు లేని పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. తమకు ఒక్క ఛాన్సివ్వండంటూ ప్రజల ముందుకు కమల్ హాసన్ వెళుతున్నారు. మరి జయలలిత, కరుణానిధి లేని ఈ ఎన్నికల్లో కమల్ హాసన్ ఏ మేరకు ప్రభావం చూపుతారో చూడాల్సి ఉంది.
Tags:Elections in Tamil Nadu

మేము గూఢచర్యం చేయలేదు: అమెరికా

 Date:30/03/2019
 ముంబయి ముచ్చట్లు :
భారత్‌ యాంటీ శాటిలైట్‌ ప్రయోగం నిర్వహించినప్పుడు అమెరికాకు ఎటువంటి గూఢచర్యం నిర్వహించలేదని పెంటగాన్‌ పేర్కొంది. ఈ ప్రయోగం తర్వాత డిగోగార్సియా స్థావరం నుంచి అమెరికా విమానం ఒకటి బంగాళఖాతంలోకి ప్రవేశించింది. దీనిపై పెంటగాన్‌ వివరణ ఇస్తూ భారత్‌ ప్రయోగం విషయం ముందే తెలుసని పేర్కొంది. ‘‘అమెరికాకు చెందిన ఏ పరికరాలు భారత్‌పై నిఘా వేయలేదు. వాస్తవానికి అమెరికా భారత్‌తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. భారత్‌తో సైనిక, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం. ’’ అని అమెరికా రక్షణశాఖ ప్రతినిధి  లెఫ్టినెంట్‌ కల్నల్‌ డేవిడ్‌ డబ్ల్యూ ఈస్ట్‌బార్న్‌ వెల్లడించారు.  అమెరికా విమానం భారత్‌పై నిఘా వేసిందని వచ్చే వార్తలతో ఇరు దేశాల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags:We did not spy: America