Natyam ad

తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి ముచ్చట్లు:
 
 
తిరుపతి వేదికగా జాతీయ క్రీడల నిర్వహణ చారిత్రాత్మక ఘట్టమని . రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ఈ నెల 9 వ తేది వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం తిరుపతి ఇందిరా మైదానంలో అట్టహాసంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి 42 జట్లు ఈ పోటీలలో పాల్గొంటున్నాయి.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన గౌ. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న కబడ్డీ క్రీడాకారులను ఒక వేదికగా తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన తిరుపతి శాసనసభ్యులను అభినందించారు. క్రీడాకారులందరూ తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించాలన్నారు.ద్రోణాచార్య అవార్డు గ్రహీత , ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ కోవిడ్ తరువాత జరుగుతున్న క్రీడా పోటీలకు తిరుపతి ఆతిద్యం ఇవ్వడం విశేషమన్నారు. క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఈ జాతీయ పోటీలు తోడ్పదతాయన్నారు. తిరుపతి వేదికగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులందరు క్రమశిక్షణతో ఉంటూ అంకితబావంతో క్రీడలలో రాణించాలని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరిపైన ఉంటాయని తెలిపారు. జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణకు కృషి చేసిన తిరుపతి శాసనసభ్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.అర్జున్ అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ్ మాట్లాడుతూ ఈ పోటీల నిర్వహణకు విశేష కృషి చేసిన ప్రతి అధికారికి ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో పోటీలలో ఉండాలన్నారు. తిరుపతిలో కబడ్డీ క్రీడాకారులకు అన్ని వసతులు ఏర్పాటు చేశారని తెలిపారు. క్రీడాకారులందరూ కష్టపడి అంకిత బావంతో క్రీడల్లో రాణించి ఉన్నత స్థానం చేరుకోవాలని తెలిపారు.
 
 
 
చిత్తూరు ఎం.పి రెడ్డెప్ప మాట్లాడతూ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ పోటీలను తిరుపతిలో జాతీయ స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.తిరుపతి ఎం.పి. డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ అంతరించి పోతున్న గ్రామీణ క్రీడలకు ఉత్తేజాన్ని అందిస్తూ తిరుపతిలో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కృషి చేసిన అందరిని అభినందించారు.జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ నేడు సంతోషకరమైన రోజు అని, తిరుపతి అంటే ఆద్యాత్మిక నగరంగానే ఉండేదని ప్రస్తుతం క్రీడల నిర్వహణ ద్వారా నగర ప్రజలకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు చొరవ చూపడం ఈ విషయంలో తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో జరగడం శుభపరిణామం అన్నారు. ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ లకు , లాప్టాప్ లకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని దీని నివారణకు పిల్లలలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ జాతీయ క్రీడలు తోడ్పడతాయని తెలిపారు.
 
 
 
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిని ఆద్యాత్మిక నగరంతో పాటు ఆటల కేంద్రంగా చేస్తామన్నారు. నేటి తరం పిల్లలు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సెల్ ఫోన్ లు, లాప్ టాప్ లకు ఎక్కువ సమయం కేటాయించకుండా క్రీడ, సాంస్కృతిక కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించేలా కృషి చేయాలన్నారు. బావితరాలకు క్రీడా స్పూర్తిని అందించేందుకు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతున్నదని, ఆద్యాత్మిక నగరమైన తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు మరియు ఈ కార్యక్రమ విజయవంతానికి సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా.ఆర్.శిరీషా మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతున్నదని గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కబడ్డీ పోటీలు జాతీయ స్థాయిలో తిరుపతిలో నిర్వహించడంలో తిరుపతి శాసనసభ్యులు అత్యంత శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు.చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించాలనే ఆలోచన రావడం శుబపరిణామమని, క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతాయని,  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్ది క్రీడలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
 
 
 
సత్యవేడు శాసనసభ్యులు ఆదిమూలం మాట్లాడుతూ తిరుపతిలో 25 సంవత్సరాల క్రితం ఎస్.వి. యూనివర్సిటీ గ్రౌండ్ లో జాతీయ స్థాయి లో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందని మరలా ప్రస్తుతం ఇందిరా మైదానంలో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా మాట్లాడుతూ నేటి తరం పిల్లలు టీవీ లకు, సెల్ ఫోన్ లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, పిల్లలను వాటినుంచి మరల్చి క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలని తెలిపారు.ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పూర్వకాలం నుండి ఒక క్రీడ అని , క్రీడల ద్వారా క్రమశిక్షణ ఏర్పడుతుందని వివిధ రాష్ట్రాల నుండి వచ్చి పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తిరుపతి వేదిక కావడం గొప్ప విషయమన్నారు.తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా పి.ఎస్.మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణను విజయవంతం చేయడంలో బాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు దాతల సహకారం మరువలేనిదని అన్నారు.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, డిప్యుటీ మేయర్ లు ముద్రా నారాయణ , అభినయ రెడ్డి, అదనపు కమీషనర్ హరిత, కౌన్సిలర్లు, ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: National Invitational Kabaddi Competition kicks off in Tirupati