Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు , సాయిబాబా ఆలయ ధర్మకర్త నాగరాజ వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని మంత్రి పెద్దిరెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మంత్రి ఆయనకు కండువ కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా. బలిజ సంఘ నాయకుడు రాయల జగదీష్‌, కౌన్సిలర్‌ రెడ్డెమ్మ, పార్టీ నాయకులు ఎస్వీటి సోము, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: National leaders joined the party in the presence of Minister Peddireddy

Post Midle