Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 100 మంది పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీనాథరెడ్డి, అనీషారెడ్డి ల ఆధ్వర్యంలో మండలంలోని అలసాపురంకు చెందిన మాజీ ఎంపీటీసీ వెంకటరమణ తో పాటు 60 మంది పార్టీలో చేరారు. అలాగే పట్టణానికి చెందిన సీనియర్‌ నాయకుడు , మాజీ కౌన్సిలర్‌ షాజహాన్‌బాషా పార్టీలో చేరారు. మరో మాజీ కౌన్సిలర్‌ ఆదినారాయణ, ఆయన సతీమణి పార్టీలో చేరారు. వీరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువ కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. అలాగే మటన్‌ వ్యాపారుల సంఘ అధ్యక్షుడు అన్సర్‌, కార్యదర్సి భక్షు, మౌల, ఖాజా, బావాజి, అలీమ్‌, సలీము, ఫారుక్‌ ల ఆధ్వర్యంలో 30 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి చెంగారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్లు కొండవీటి గంగులమ్మ, పూలత్యాగరాజు, రాష్ట్ర జానపద కళల సంస్థ అధ్యక్షుడు కొండవీటి నాగభూషణం, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము , మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, పార్టీ నాయకులు మమ్ము, అస్లాంమురాధి, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: National leaders joined the party in the presence of Minister Peddireddy

Post Midle