Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు పలువురు పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు ఆర్‌టి .రాజారెడ్డి, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు పార్టీలో చేరారు. అలాగే చింతపండు వ్యాపారి అహమ్మదాలి పార్టీలో చేరారు. కట్టక్రిందపాళెంకు చెందిన తెలుగుదేశం నాయకులు మల్లికార్జునరాజు, వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరారు. అలాగే మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మైనార్టీల నాయకుడు నజీర్‌ ఆధ్వర్యంలో ముస్లింయూత్‌ సభ్యులు జాకీర్‌, అబ్బాస్‌, మహమ్మద్‌, ముభారక్‌, ఇర్ఫాన్‌, షఫి, ఇమ్రాన్‌, యూసుఫ్‌, షారు, ఆయాన్‌తో పాటు 20 మంది పార్టీలో చేరారు. వీరిందరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీనాథరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కో ఆఫ్షన్‌ మెంబరు తుంగా మంజునాథ్‌, బలిజ సంఘ నాయకులు రాయలజగదీష్‌కుమార్‌, పార్టీ నాయకులు ప్రభాకర్‌, రాజారెడ్డి, మునిరాజ, ఆవుల హరి, ఎస్వీటి సోము పాల్గొన్నారు.

Post Midle

 

Tags; National leaders joined the party in the presence of Minister Peddireddy

 

Post Midle