Natyam ad

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన దేశం నేతలు

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 50 మంది పార్టీలో చేరారు. ఆదివారం పార్టీ నాయకులు రాయలజగదీష్‌, ప్రభాకర్‌, వెంకట్రమణారెడ్డి, శంకరప్ప, నంజుండప్ప ఆధ్వర్యంలో మండలంలోని కీలకిరి గ్రామానికి చెందిన భాస్కర్‌, రాజశేఖర్‌, చంద్రప్ప, సోమశేఖర్‌, సుబ్బరాయప్ప, మహేష్‌, వెంకట్రమణ, లోకేష్‌, భరత్‌, వెంకట్రమణ, సుబ్రమణ్యం, జి.భాస్కర్‌, శీనప్ప, ఏ.వెంకట్రమణ, శ్రీరామాచారితో పాటు 10 మంది పార్టీలో చేరారు. అలాగే భరిణేపల్లికి చెందిన బిసివై నాయకుడు గంగాధర్‌ను, సర్పంచ్‌ గంగాధర్‌ , బాబు ఆధ్వర్యంలో చేరారు. అలాగే సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్‌ అర్షద్‌అలి, నాయకులు అస్లాంమురాధి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ నాయకురాళ్ళు హాసినా, నజీర్‌, నవాజ్‌, షబనం, షాకీర్‌, దిల్‌షాద్‌, రాబియా, రుక్‌సాన, షబిన్‌తాజ్‌తో పాటు 15 మంది పార్టీలో చేరారు. అలాగే కుమ్మరవీధికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అస్లాంమురాధి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ బూత్‌ కన్వీనర్‌ సయ్యద్‌ పార్టీలో చేరారు. దోబీకాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ శోభ, హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో బిసివై పార్టీ వలంటీర్లు వెంకటలక్ష్మీ, జ్యోతి, శక్తి, లావణ్య లు పార్టీలో చేరారు. వీరిందరికి మంత్రి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి , జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యదర్శి దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Post Midle

Tags: National leaders joined the party in the presence of Minister Peddireddy

 

Post Midle