జ‌న‌వ‌రి 28న జాతీయ స్థాయి భ‌గ‌వ‌ద్గీత పోటీలు

Date:27/01/2021

తిరుపతి ముచ్చట్లు:

టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో జ‌న‌వ‌రి 28, 29వ తేదీల‌లో విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.గ‌త నెల‌లో ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క, కేర‌ళ‌ రాష్ట్రాల్లోని 6 నుండి 9 వ తరగతి వ‌ర‌కు గ‌ల‌ విద్యార్ధినీ విద్యార్థులకు శ్రీమద్భగవద్గీతపై పోటీలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇందులో ప్ర‌థ‌మ బ‌హుమ‌తులు పొందిన విద్యార్ధినీ విద్యార్థులకు జ‌న‌వ‌రి 28వ తేదీ గురువారం ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 29న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు.కోవిడ్ – 19 నిబంధనలు పాటిస్తూనే విద్యార్థినీ విద్యార్థులు పోటీల‌లో పాల్గొన‌వ‌ల‌సి ఉంటుంది.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: National Level Music Competitions on 28th January

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *