డిసెంబర్ 9న జాతీయ లోక్‌అదాలత్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు కోర్టు ఆవరణంలో డిసెంబర్ 9న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌లో ప్రతి ఒక్కరు అధిక కేసులు పరిష్కరించి జయప్రదం చేయాలని సీనియర్ సివిల్‌జడ్జి వాసుదేవరావు కోరారు. శనివారం సాయంత్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందుతో కలసి పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ న్యాయస్థానాలలో పెండింగ్ కేసులను పరిష్కరించే దిశలో లోక్‌అదాలత్‌లను న్యాయవాదులు, ప్రజలు వేదిక చేసుకోవాలన్నారు. లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరిస్తామన్నారు. పోలీస్‌స్టేషన్ల పరిధిలో గల ఇరు పార్టీలను పిలిపించి, రాజీమార్గంలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఐలు రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్‌ఈబి సీఐ సీతారామిరెడ్డి, ఎస్‌ఐలు రవికుమార్, శ్రీనివాసులు, పోలీసులు పాల్గొన్నారు.

Tags: National Lok Adalat on 9 December
