డిసెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

Date:21/11/2020

నెల్లూరు  ముచ్చట్లు:

డిసెంబర్ 12వ తేదీ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఒక ప్రకటనలో పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి మరియు ప్యాట్రన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ , జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ 12వ తేదీ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంతోకాలం నుండి , పరిష్కారానికి నోచుకోక ఉన్నటువంటి వివిధ వివాదాల కేసులను శాశ్వత పరిష్కారం కొరకు, సమయం ఆదా తో పాటు, త్వరితగతిన న్యాయం పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. నెల్లూరు జిల్లాలో ఈ లోక అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి  ఏ. శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం ఎం .శ్రీనివాస్ నాయక్ తదితరుల ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లాలోని 9 మండలాలలో  డిసెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలోని కోవూరు , కావలి, గూడూరు, వెంకటగిరి , ఆత్మకూరు, కోట, ఉదయగిరి, సూళ్లూరు పేట, నాయుడుపేట తదితర మండల కేంద్రాలతోపాటు జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కక్షిదారులు రాజీ పడదగిన మోటార్ యాక్సిడెంట్స్ , వివిధ రకాల సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, తదితర అన్నిరకాల కేసులను రాజీ చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని , శాశ్వత పరిష్కారాలను పొందవలసిందిగా పిలుపునిచ్చారు.

నందింగం.. ఉండవల్లి మధ్యలో డొక్కా

Tags: National Lok Adalat on December 12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *