పుంగనూరులో ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌అదాలత్
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11 న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవారావు తెలిపారు. శుక్రవారం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి కార్తీక్, అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి సిందుతో కలసి ఆయన న్యాయవాదులతో, అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులు సమన్వయంతో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులపై అప్పీల్ ఉండదని తెలిపారు. దీనితో పాటు లోక్‌అదాలత్‌లో పరిష్కారమైయ్యే కేసులకు కోర్టు ఫీజులు వాపస్సు ఇవ్వబడుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని , సామరస్యధోరణిలో సమస్యలు లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకుని సంతోషంగా జీవించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: National Lok Adalat on February 11 at Punganur
