పుంగనూరులో జూలై 10న జాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కోర్టు ఆవరణంలో జూలై 10న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌ తెలిపారు. మంగళవారం ఆయన న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వీరమోహన్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌ తో కలసి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ ఆదేశాల మేరకు లోక్‌అదాలత్‌ నిర్వహిస్తామన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో రాజీ చేయబడిన సీవిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు పట్టుదలవీడి, రాజీమార్గంలో లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: National Lok Adalat on July 10 in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *