పుంగనూరులో 12న జాతీయ లోక్‌అదాలత్‌

Date:04/12/2020

పుంగనూరు ముచ్చట్లు:

పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు ఈనెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి వెంకటేశ్వరశర్మతో కలసి న్యాయవాదులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బాబునాయక్‌ మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో రాజీకి అనువైన కేసులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరించేలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ నాయకులు పులిరామకృష్ణారెడ్డి, కెవి.ఆనంద్‌కుమార్‌, సీఐ లు గంగిరెడ్డి, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.

పొడుగు పాడు గ్రామ పంచాయతీని పరిశీలించిన డి పి ఓ

Tags: National Lok Adalat on the 12th in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *