జాతీయ లోక్ అదాలత్

గూడూరు ముచ్చట్లు:


కక్షిదారులు సత్వర న్యాయం పొందేందుకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్విన్ సుల్తానా బేగం తెలిపారు . గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో గూడూరు మండలం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు .పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో గూడూరు మండలం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టప్రకారం రాజీ కాబడే సివిల్ మరియు క్రిమినల్ కేసులను పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి షమ్మీ పర్విన్ సుల్తానా బేగం మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ లో అత్యధిక సంఖ్యలో కేసును పరిష్కరించి పడితే కోర్టులపై పని భారం తగ్గుతుందని కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు . కక్షిదారులు  జాతీయ లోక్ అదాలత్ ల ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి  జానీ భాష , ఫస్ట్ క్లాస్ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లోకనాథం ,  ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జి  అశోక్ కుమార్ మండల న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు ,  న్యాయవాదులు కక్షిదారులు , కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

 

Tags: National Lok Adalat

Leave A Reply

Your email address will not be published.