కళాకారుడు మారం ప్రవీణ్కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం

వేములవాడ ముచ్చట్లు:

 

వేములవాడలో తెలుగు వెలుగు సాహితి స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ మహానంది పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నృత్య కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ (పప్పీ) జాతీయ మహానంది అవార్డుని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, డిఎస్పీ నాగేంద్ర చారి, రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షులు కొండ దేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్ వంగాల దివ్య శ్రీనివాస్ ల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంత కళాకారుడిగా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషిస్తూ తనదైన శైలిలో ప్రజల మన్నన్లను పొందుతున్న మారం ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.   అనంతరం మారం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమములో తనతో పాటు కూడా ప్రముఖ గాయకులు, రచయిత సై టీవీ అధినేత మాట్ల తిరుపతిని కూడా జాతీయ మహానంది అవార్డును ప్రధానం చేసినందుకు తెలుగు వెలుగు సాహితీ సంస్థ వారికి, అతిధులకు కళాభివందనాలు తెలియజేశారు.

 

Tags: National Mahanandi award to artist Maram Praveenkumar

Leave A Reply

Your email address will not be published.