Natyam ad

నేషనల్ ఫోటో వర్క్ షాప్  విజేత రాజు

-లంబాడీ లైఫ్ స్టైల్ లో ఉత్తమ ఛాయాచిత్రంగా అవార్డు

జయశంకర్ ముచ్చట్లు:

మహబూబాబాద్ జిల్లా-“ఉట్ల” తండా గ్రామంలో లంబాడీల సంప్రదాయ జీవనశైలి పై అక్టోబర్29 నుండి 31వరకు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్,మహబూబాబాద్ మరియు నిర్వాహకులు హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ఫోటో గ్రఫీ చిత్రకళ లో నేషనల్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.ఈ ఫోటో వర్క్ షాప్ లో మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన వర్ధమాన ఫోటోగ్రాఫర్ పంతకాని రాజు తీసిన ఛాయాచిత్రానికి ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది.తమిళనాడు,కర్ణాటక,ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో నిష్ణాతులైన 40 మంది ఫోటోగ్రాఫర్ల్ 240 ఛాయాచిత్రాలు పోటీలో ఉండగా,ఐదు రౌండ్లు గా ఎలిమినెట్ పద్దతిలో ఉత్కంఠ భరితంగా సాగిన జర్జిమెంట్ లో,ఫలితాలు నిర్ణయించడానికి 8 గంటల సమయం పట్టింది..నిన్నటి సాయంత్రాన మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందుకున్నారు.నేను తీసిన చిత్రం ఉత్తమ ఛాయాచిత్రంగా అవార్డు దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని,నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్ల మధ్యలోనుండి ఈ అవార్డు అందుకోవడం,మర్చిపోలేని ఈ మధుర క్షణాలు జీవితం ఉన్నంతవరకు గుర్తుంటాయని,ఓ ఫోటోగ్రాఫర్ కళాకారునిగా గర్వపడుతున్నామని పంతకాని రాజు అన్నారు.నాలోని ప్రతిభ ను ఆధారిస్తూ,ఫోటో గ్రాఫర్ వృత్తిలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న గ్రామస్తులకు మరియు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

 

Post Midle

Tags: National Photo Workshop  Winner Raju

Post Midle

Leave A Reply

Your email address will not be published.