జాతీయ వర్షాధార ప్రాంత పథకం
పత్తికొండ ముచ్చట్లు:

మండల వ్యవసాయ అధికారి వెంకటరాముడు ఆధ్వర్యంలో చిన్నహుల్తి గ్రామ రైతులకు జాతీయ వర్షాధార ప్రాంత పథకం పథకం కింద సబ్సిడీ ద్వారా చిన్నహుల్తి గ్రామ రైతులకు సబ్సిడీ ద్వారా పెబ్బేరు పశువుల మార్కెట్ నందు గ్రామ సర్పంచ్ కేశవరెడ్డి చేతుల మీదుగా రైతులకు పశువుల సంతలో ఆవులను కొనుగోలు చేయడం జరిగినది.ఈ పథకం కింద ఆవులు,మేకలు, కోళ్లు ను 50% రాయితీ కింద రైతులకు ఇవ్వబడును. అలాగే పండ్లతోటలైన దానిమ్మ, చినీ వంటి పంటలు వేసే వారికి 50% రాయితీ కింద ఇవ్వబడును. గ్రామం నందు ఆవులు 8 యూనిట్లు, కోళ్లు 28 యూనిట్లు, మేకలు 22 యూనిట్లు, పళ్ళ తోటలు 8 యూనిట్లు ఇవ్వబడును.ఒక రైతుకు ఒక యూనిట్ కింద 2 ఆవులు, 10 మేకలు, 20 కోళ్లు, పండ్ల తోటలు 5 ఎకరాలు చొప్పున 50% రాయితీ ఇవ్వబడును అని మండల వ్యవసాయ అధికారి వారు గ్రామ రైతులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమం నందు పత్తికొండ మండల వ్యవసాయ అధికారి వెంకట్రాముడు వారు చిన్నహుల్తి గ్రామ సర్పంచ్ కేశవరెడ్డి పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్ వినయ్ ,, వ్యవసాయ విస్తరణ అధికారి రియాజ్ బాషా వారు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లక్ష్మి నారాయణ మరియు అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ నాయక్ ఆర్ బి కే వాలంటీర్ వీరాంజనేయులు రైతులు పాల్గొనడం జరిగింది.
Tags;National Rainfed Area Scheme
