జాతీయ హోదా పాయో

హైదరాబాద్ ముచ్చట్లు:
ను.. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ జాతీయ హోదా ఉన్నట్టా ? లేన‌ట్టా ? ఇప్పుడు ఈ ప్రశ్న ఇటు నెటిజ‌న్ల నుంచి అటు రాజ‌కీయ నేత‌ల నుంచి కూడా వ్యక్తమ‌వుతోంది. ఇరు రాష్ట్రాలుగా ఏర్పడిన త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీని జాతీయ పార్టీగా పేర్కొంటూ.. అటు ఒడిశా, ఇటు త‌మిళ‌నాడు, మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో టీడీపీ బ‌లంగా ఉందంటూ.. పార్టీ అధినేత చంద్రబాబు.. ప్రక‌టించారు. ఇదే విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా తెలిపారు. ఈ క్రమంలోనే త‌న‌నుతాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా పేర్కొంటూ.. త‌న కుమారుడు లోకేష్‌ను జాతీయ ప్రధాన కార్యద‌ర్శిగా నియ‌మించుకున్నారు.పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ జాతీయ పార్టీ అంటూ ఒక్కటే హంగామా న‌డిచేది. అయితే.. ఈ జాతీయ స్థాయిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వ‌ర‌కు ఏమీ తేల్చ లేక‌పోయింది. ఇక‌, ఇప్పుడు ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. రెండు కీల‌క రాష్ట్రాలైన తెలంగాణ‌, ఏపీల్లో టీడీపీ ఒడిదుడుకుల‌కు గుర‌వుతోంది. తెలంగాణలో పార్టీ ఉంటుందా? ఉండ‌దా? అనే సందేహాలు వ్యక్తమ‌వుతున్నాయి. ఆ పార్టీకి ఇటీవ‌ల వ‌ర‌కు ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మ‌చ్చా నాగేశ్వర‌రావు సైతం టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ చ‌రిత్రలోనే తెలంగాణ‌లో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ ర‌మ‌ణ‌.. త్వర‌లోనే టీఆర్ ఎస్ గూటికిచేరిపోతార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, ఇప్పటికే ఉన్న నాయ‌కులు కూడా పార్టీ మారిపోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి (తెలంగాణ‌) జెండా మోసే నాయ‌కులు కూడా టీడీపీలో క‌నిపించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. త‌మిళ‌నాడులో పార్టీ ఉంద‌ని చెబుతున్నా.. ఇది కేవ‌లం మాట‌ల వ‌ర‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. పేరుకు మాత్రమే చెన్నై టీడీపీ ఫోర‌మ్ పెట్టుకుని హంగామా చేస్తుంటారే త‌ప్పా అక్కడ పార్టీలో ప‌ట్టుమ‌ని పేరున్న నాయ‌కులు ఎవ్వరూ లేరు. ఇక‌, ఇత‌ర రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీకి జాతీయ హోదా అనేది క‌ష్టమేనని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీలోనూ ప‌డుతూ లేస్తూ.. ఉన్న టీడీపీ కేవ‌లం ఈ ఒక్క రాష్ట్రానికే ప‌రిమిత‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. పార్టీ గ‌త ఐదేళ్లలో అధికారంలో ఉన్న చోటే టీడీపీ బ‌తికి బ‌ట్ట క‌డుతుందా ? అన్న డౌట్ ఉందంటే మిగిలిన చోట్ల పార్టీ ప‌రిస్థితి గురించి చ‌ర్చించుకోవ‌డం అన‌వ‌స‌రం.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:National Status Pao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *