National Voters Day

కేసిపల్లె సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం

– ఓటర్లను చైతన్యపరచడం మేధావుల కర్తవ్యం

– మేధావి మౌనం దేశానికి ప్రమాదం

Date:25/01/2020

రామసముద్రం ముచ్చట్లు:

ఓటు అనే రెండక్షరాలకు, ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంటుందని వైకాపా నాయకులు లాయర్ రమణారెడ్డి, దిగువపల్లి శ్రీనివాసులురెడ్డిలు అన్నారు. శనివారం మండలంలోని కుదురుచీమనపల్లి సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా లాయర్ రమణారెడ్డి, దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుందని, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుందన్నారు. ఓటు ఆవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు యొక్క ప్రాధాన్యత గురించి ,ఓటరును చైతన్యం చేయడంలో భాగంగా, ఎన్నికల కమిషను ఏర్పాటైందని వారు పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, నా వంతు కర్తవ్యాన్ని గుర్తించి, ఉన్నతమైన నాయకుడిని ఎన్నుకుంటానని ఓటర్ల చేత ప్రమాణం కూడా ప్రతిజ్ఞ చేయించారు.

 

 

 

కుల, మత ,ప్రాంత, జాతి, లింగ, భాష, ఆర్థిక భేద భావం లేకుండా, దేశంలో నివసించే, మేజర్ అయిన, ప్రతి యువతీ, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం కల్పిచిందని తెలిపారు. 125 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో, సుమారు నూరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 50 కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించు కుంటున్నారన్నారు. న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థ కంటే, శక్తిమంతమైన పాత్ర శాసనాలు తయారుచేసే పార్లమెంటు మరియు అసెంబ్లీలదని సూచించారు. ఉన్నత విలువలతో కూడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన రాజకీయ నేతలు నేరస్తులు కాకూడదనే ఉద్దేశంతో, దానిని అడ్డుకునే సంస్కరణలు తీసుకు రావడానికి 1975 లో తార్కుండే కమిటీ,1998 లో, ఇంద్రజిత్ గుప్తా కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది..ఇందులో భాగంగానే, ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలు అవుతున్నది.

 

 

 

లోక్ సభ ఎన్నికల ఖర్చు 25 లక్షలు గానూ, అసెంబ్లీ ఎన్నికల ఖర్చు 10 లక్షలకు 10 లక్షలకు మించకూడదని 2004లో నిబంధనలు విధించారు .మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించాలని, రాజ్యాంగం యొక్క లక్ష్యం కూడా అదేనని రాజకీయ ప్రజాస్వామ్యం సామాన్యులకు కూడా అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు.
చివరగా, ‘ఓటు’ ఓటర్ల చేతిలో బ్రహ్మాస్త్రం, ఓటు అమ్ముకోవడం అంటే మన కళ్ళను మనమే పొడుచు కోవడం లాంటిదన్నారు. ఓటరు అనే విల్లుతో, ఓటు అనే బాణాన్ని ప్రయోగించి, ఓటరు అంటే, ఓహ్! అనేలా ఉండాలనేది మన అందరి ఆశయం కావాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలింటీర్లు మేఘన, రేణుక, రెడ్డెమ్మ, శ్రావణి, కుమార స్వామి, దినకర్, వెంకటరమణ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.

టర్కీలో భూకంపం..19 మంది మృతి

 

Tags: National Voters Day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *