Natyam ad

జాతీయ ఓటర్ల దినోత్సవం

శ్రీకాకుళం నగరంలో భారీ ర్యాలీపాల్గోన్న జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం ముచ్చట్లు:


ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం లో ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ఓటరు కారణం అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేష్ లాఠకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నూతన ఓటర్లకు గుర్తుంపు కార్డ్లులు పంపిణి చేశారు . గురువారం శ్రీకాకుళం నగరంలో 14 వ  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ర్యాలీ చేపట్టారు . ఈ ర్యాలీ నగరం లో సూర్యమహల్ జంక్షన్ నుండి ఏడు రోడ్ల కూడలి వరకు సాగింది .  అనంతరం మానవహారం  ఏర్పాటు చేసి ఓటర్ అవగాహనా కల్పించారు . శ్రీకాకుళం జిల్లాలో 18 ,59 ,910 మంది ఓటర్లు ఉన్నారనున్నారు . ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా  నిజాయితిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఓటు హక్కు ప్రాధాన్యత పై పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు . 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా తమ పేరు నమోదు చేసుకొని ఓటు హక్కును  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

Post Midle

Tags: National Voter’s Day

Post Midle