Natyam ad

కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి

కడప ముచ్చట్లు:

భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో భారత జాతీయ కాంగ్రెస్ కీలక భూమిక పోషించిందని ఆపార్టీ కడప జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అన్నారు.సోమవారం కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వజ్రోత్సవాలను కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు.
వజ్రోత్సవాల సందర్భంగా అన్ని నియోజకవర్గాలలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టిందన్నారు.మనకు స్వాతంత్రం అందించిన స్వాతంత్ర సమరయోధులనుస్మరించుకోవడం, వారు అందించిన స్వాతంత్రానికి నిజమైన అర్థం చెప్పడమే పాదయాత్ర పరమావధి అన్నారు.
ఈనెల తొమ్మిదవ తేదీ నుంచి 14వ తేదీ వరకు కడప పార్లమెంటులోని నియోజకవర్గాలలో పాదయాత్ర నిర్వహింపబడుతుందన్నారు.

 

 

Post Midle

9వ తేదీ పులివెందుల నియోజ కవర్గం లోని వేంపల్లి లో, పదవ తేదీ కమలాపురం నియోజకవర్గంలో, 11వ తేదీ జమ్మలమడుగు నియోజకవర్గంలో, 12వ తేదీ బద్వేల్ నియోజకవర్గం లో, 13వ తేదీ పొద్దుటూరు నియోజకవర్గంలో, 14వ తేదీ కడప నియోజకవర్గం లో పాదయాత్ర నిర్వహిస్తామ న్నారుభారత మొదటి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరచి, శాస్త్ర సాంకేతిక రంగాన్ని, విద్యా, వైద్య రంగాన్ని, మౌలిక వసతులు, రోడ్డు ,రైలు మార్గాలు, విమానయానం, పోర్టుల అభివృద్ధి, లాంటి అనేక రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్తే, అనంతరం ఇందిరాగాంధీ ప్రధానిగా దేశంలో ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, తిండి, ఇల్లు ఉండాలని దానికోసం పనిచేసారన్నారు.బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, మహిళా అభివృద్ధి ధ్యేయంగా, మైనార్టీల అభివృద్ధి కోసం పని చేశారన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి భారత దేశ ఔన్నత్యాన్ని చాటారన్నారు.కార్యక్రమంలో  రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రీసెర్చ్ విభాగం చైర్మన్ విజయ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ పాల్గొన్నారు.

 

Tags: Nation’s development is with Congress

Post Midle

Leave A Reply

Your email address will not be published.