దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం

Date:26/11/2020

గోనెగండ్ల  ముచ్చట్లు:

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గోనెగండ్ల మండలం లో సమ్మెను విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేసిన కార్మిక వ్యతిరేక మార్పులకు కీలక రంగాల ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణకు పారిశ్రామిక కార్మికులు ధరల సూచిని 2016 మార్చటానికి రైతులకు నష్టదాయకమైన చట్టాలు చేయడానికి విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు కరోనా పరిస్థితుల వలన ఇబ్బందులు పడుతున్న కార్మికులను,ప్రజలు ఆర్థికంగా ఆదుకోవాలని వారు అన్నారుమోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేసే ప్రజలపై భారాలు వేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు మోడీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణను ప్రారంభించి ఉద్యోగులను కొత్త ప్రైవేటు పెట్టుబడిదారుల వదిలేసిందిబడా కార్పొరేట్ కంపెనీల నుంచి అప్పులు వసూలు చేయకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం వాటి ప్రైవేటీకరణకు లక్షలాది కోట్ల ఆస్తులతో దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఎల్ఐసి ని ప్రవేటు పరం చేస్తున్నది రైల్వే బిఎస్ఎన్ఎల్ విమానాశ్రయాలు ఎయిర్ ఇండియా డిస్టెన్స్ పరిశ్రమలు రోడ్డు రవాణా రంగ పరిశ్రమలు కూడా వదలకుండా ప్రైవేటు పరం చేస్తున్నది .

 

 

 

ప్రజాధనంతో నిర్మించుకున్న  ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు భారీ స్థాయిలో ధారాదత్తం చేస్తుంది ప్రభుత్వరంగం ప్రైవేటీకరణ అయితే అయితే  ప్రజలపై ఛార్జీలు ధరల భారం పడుతుంది రిజర్వేషన్లు లేకుండా పోయి సామాజిక న్యాయం దెబ్బతింటుంది అన్నారుప్రజాస్వామ్యానికి పాత్ర వేసి ఓటింగ్ లేకుండా మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో పాస్ చేసింది కార్పొరేట్ వ్యవసాయానికి వీలు కల్పిస్తూ రైతులనుకార్పొరేట్ కంపెనీలకు కూలీలుగా మారుస్తున్నారు కనీస మద్దతు ధర కంటే తక్కువకు నచ్చకుండా వ్యాపారులు పక్షాన నిలిచిందిఅన్నారు రాష్ట్రప్రభుత్వం 50 లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు సహకరించలేదు కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక బిల్లులకు అధికార వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఓటు వేశాయి .

 

 

మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను బలపరుస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం బిల్డింగ్కార్మికుల సంక్షేమంనిధులను చట్టవ్యతిరేకంగా దారి మళ్ళించి వారి సంక్షేమ పథకాలను నిలిపివేసే కేంద్ర  మోటార్ సవరణను అమలు జరిమానాలు వేలాది రూపాయలు పెంచే జీవో ఇచ్చింది విద్యుత్ ప్రైవేటీకరణకు దారులు తెరిచిన మోడీ ఆదేశాల మేరకు మున్సిపల్ సంస్కరణలు అమలు చేస్తున్నది వారు కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారుఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు మద్దిలేటి నాయుడు సిఐటియు మండల కార్యదర్శి నవీన్ రసూల్ నరసింహులు బత్తుకన్న యుటిఎఫ్ మండల కార్యదర్శి నరసింహ రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు అశోక్ ఆశ వర్కర్స్ నాయకురాలు మైమోనా జైనబి అంగన్వాడి వర్కర్స్ నాయకురాలు ఐకెపి నాయకులు హనుమంతు మీనల్ల వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఏఐటియుసి తదితరులు పాల్గొన్నారు.

నివర్‌ వరద భీభత్సం

Tags: Nationwide general strike triumphant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *