జనసేనకు నెట్ జన్ల షాక్….

Native genetics shock

Native genetics shock

Date:13/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నెట్ జన్లు ఫుల్ షాక్ ఇచ్చారు.. అమరావతి  నిర్మాణంపై అనేక రకాల కామెంట్స్ చేస్తున్న పవన్ కు అదే లెవల్ లో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. రకరకాల తిక్క తిక్క ఆరోపణలు చేస్తున్నారు. నోటికి వచ్చింది కదా.. ప్రాస బాగుంది కదా అని… ప్రజాసంబంధిత అంశాలపై విమర్శలు చేస్తే మాత్రం… అవి రివర్స్ అయితే..ఇలాగే రివర్స్ పంచులవుతాయి. తేడా వస్తే.. క్యారెక్టర్ మీదే దెబ్బ పడిపోతుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పదిస్థితి అదే. ఈ పంచ్ లకు సమాధానం చెప్పుకోలేక పవన్… లోపల్లోపల కుమిలి పోయి ఉంటాడు. మరో వారం రోజుల దాకా బయటకు రాకపోవచ్చు.ఓ సారి రెండు వందల ఎకరాలు చాలంటారు. మరో సారి ప్రాంతానికో రెండు వేల ఎకరాలివ్వాలంటారు. ఇంకో సారి ఎవరి రాజదాని అమరావతి అంటూ పుస్తకావిష్కరణకు వెళ్లి … రాళ్లేయాలని ప్రయత్నిస్తూంటారు.మైక్ దొరికింది కదా అని అమరావతిపై మరో రాయి వేయాలని చూశారు. కానీ అది నేరుగా రిటర్న్ అయి వచ్చి… పవన్ కే పంచ్ ఇచ్చింది. దీంతో ఆయనకు మైండ్ బ్లాకవ్వాల్సి వచ్చింది.ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే… అమరావతి నిర్మాణాలకు దేశంలో ఎంతో మంది ఇంజినీర్లు ఉండగా… సింగపూర్ నుంచి నిపుణులను తీసుకురావడమెందుకని.. ప్రశ్నించారు. అదేదో చంద్రబాబు.. తన బంధువల్ని సింగపూర్ నుంచి తెప్పించి కడుతున్నట్లు.. షో చేసే ప్రయత్నం చేశారు. పవన్ కల్యాణ్ ఇలా అమరావతిపై ఈ విమర్శ చేశారో లేదో.. వెంటనే పంచ్ లు ప్రారంభమయ్యాయి. దేశంలో అరవై కోట్ల మంది ఆడవాళ్లు ఉండగా.. నీకు విదేశీ పెళ్లాం ఎదుకు కావాల్సి వచ్చిందంటూ… డైరక్ట్ ఎటాక్ ప్రారంభమయింది. దీనిపై జనసేనకు ఒక్కసారిగా ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. ఈ పంచ్ ల దెబ్బకు.. జనసేన నేతలకు మైండ్ బ్లాకయింది.రాజకీయ నాయకుడ్నయిపోయానని ముందూ వెనుకా చూడకుండా.. ప్రభుత్వంపై రాళ్లేయడమే లక్ష్యంగా రాజకీయంగా చేద్దామనుకుంటే.. ఇలాంటి పంచులే తగులుతూంటాయి. అడ్డంగా పరువు తీసేస్తూంటాయి. అయినా ముందూ వెనుకా ఆలోచించకుని విమర్శలు చేయాలి. అన్ని వివరాలు కనుక్కుని … రాళ్లేసే ప్రయత్నం చేయాలి.
Tags: Native genetics shock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *