నవ దంపతుల ఆత్మహత్యాయత్నం భర్త మృతి

నిజామాబాద్ ముచ్చట్లు :
నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పట్టుమని పది రోజులు గడవక ముందే సోమవారం  నవ దంపతులు ఆత్మహత్యాయత్నంచేసారు.  వరుడు భీమ్ రావు  చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తనకు  ఇష్టం లేని పెళ్లి చేసారని వధువు తాను  తాగి భర్తకు పురుగుల మందు ఇచ్చింది. భర్త మృతితో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పచ్చలనడ్కుడకు చెందిన గంధం భీమయ్యకు మాక్లూర్ మండలం మానిక్బండార్కు చెందిన కొండపల్లి స్వాతితో ఈ నెల 13న వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగించుకొని రెండు కుంటుబాల సభ్యులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.  అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. స్వాతితో పోలీసులు మాట్లాడగా.. పెళ్లి తనకు ఇష్టం లేదని, బలవంతంగా చేశారని తెలిపింది.  కలిసి జీవించలేం, కలిసి చనిపోదామని తాను పురుగుల మందు తాగి భర్తకు గ్లాసులో ఇచ్చి తాగించినట్లు వాగ్మూలం ఇచ్చింది.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

 

Tags:Nava couple’s suicide attempt husband dies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *