తిరుచానూరులో మూడోరోజు నవకుండాత్మక శ్రీ‌యాగం

తిరుప‌తి ముచ్చట్లు:
ప్రపంచశాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కోసం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో నవకుండాత్మక శ్రీ‌యాగం ఆదివారం మూడో రోజు కొనసాగుతోంది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చకులు శ్రీ వేంపల్లి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ఏకాంతంగా ఈ యాగ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. యాగ క్రతువులను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.
ఆదివారం ఉదయంశ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి మ‌ధ్యాహ్నం వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేద‌న‌, హారతి, వేద విన్న‌పం నిర్వ‌హించారు. తిరిగి సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు. టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి దంపతులు జరిపిస్తున్న ఈ కార్యక్రమంలో ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, అర్చకులు  బాబు స్వామి పాల్గొన్నారు.

పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Navakundatmaka Sriyagam on the third day in Thiruchanur

Natyam ad