నౌకాదళ విన్యాసాలు

విశాఖపట్నం ముచ్చట్లు:


డిసెంబరు 4వ తేదీన జరిగే నౌకాదళ దినోత్సవానికి తూర్పు నౌకాదళం అధికారులు కసరత్తు ప్రారంభించారు. సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించడం, కదులుతున్న యుద్ధనౌకపై హెలికాప్టర్ దిగడం, ఆకాశంలో హెలికాప్టర్ నుంచి పారాచూట్ సాయంతో సురక్షితంగా తీరంలో దిగడం వంటివి రిహార్సల్ చేశారు. నేవీ డేకు లక్ష మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 

Tags: Naval manoeuvres

Post Midle
Post Midle