బాసర అమ్మవారి సన్నిధిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Navarathri celebrations will begin in the presence of Basara Amma

Navarathri celebrations will begin in the presence of Basara Amma

– శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి అమ్మవారు
– భారీగా అక్షర శ్రీకార పూజలు
– అమ్మవారిని దర్శించుకున్న ఆపద్ధర్మ మంత్రి అల్లోల దంపతులు,
Date:10/10/2018
నిర్మల్  ముచ్చట్లు:
నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నేడు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి,తొమ్మిది రోజులపాటు జరగనున్న శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు, అమ్మవారి ఆలయం లో గణపతి పూజా, పుణ్యాహవాచనం, కళశ స్థాపన, అమ్మవారికి ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి, శారదీయ, శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజైన నేడు  శైలపుత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు,సరస్వతి అమ్మవారిని కుటుంబ సమేతంగా ఆపద్ధర్మ తాజా మాజీ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇంద్రకరణ్ రెడ్డి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద మొత్తంలో భక్తులు అమ్మవారి  దీక్షలను చేపట్టారు.. మహిళాభక్తులు అమ్మవారికి చీరలను భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నారు. భక్తులు రద్దీతో క్యూలైన్లు, ప్రత్యేక అక్షరాబ్యాస, కుంకుమార్చన మండపాలు నిండుగా దర్శనమిచ్చాయి, ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చర్యలు తీసుకున్నారు.గణపతి పూజా పున్యాః వాచన పూర్వక మహాసంకల్పయుక్త రుద్రచమక పంచసూక్త దేవీ అధర్వశీర్ష మహామంత్రయుక్త అభిషేచనపూర్వక ధ్యాన ఆవాహన షోడశోపచార పూజలతో నైవేద్యపూర్వక మహాహారతులతో పాటు భక్తులకు తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు.
నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజైన కలశ స్థాపన కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి, ఏ ఈవో గంగా శ్రీనివాస్, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్,ఆలయ ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఆలయ పాలకమండలి సభ్యులు. భక్తులు పాల్గొన్నారు.బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నిజామాబాదు కు చెందిన మైసరి,లక్ష్మినారాయణ కుటుంబసభ్యులు బంగారుకాసులహారం 51 గ్రాముల 20 మిల్లి గ్రాములు, వెండి తాంబూలం 1కేజీ 118 గ్రాముల విలువ గల వస్తువులను ఆలయ ప్రత్యేక అధికారి సుధాకర్ రెడ్డి సమక్షంలో ఆభరణాలను అమ్మవారికి బహుకరించారు.
జ్ఞాన సరస్వతి అమ్మవారికి నిజామాబాదు జిల్ల మెండోరా మండలం ఎల్కటూర్ గ్రామానికి చెందిన శ్రీ రదరం కవిత అనిల్ కుమార్ దంపతులు అమ్మవారికి 19 గ్రాముల 990 మిల్లి గ్రాముల బంగారు పుస్తెల తాడు(బంగారు చైన్),15 గ్రాముల 720 మిల్లి గ్రాముల విలువ గల ముక్కు పుడక, వస్తువులను ఆలయ ప్రత్యేక అధికారి అన్నాఢీ సుధాకర్ రెడ్డి, ఆలయ స్థాన చార్యుడు ప్రవీణ్ పాఠక్,ప్రదనచార్యుడు సంజీవపూజరి, ఆలయ పాలక వర్గ సభ్యుల సమక్షంలో అందజేశారు…. నమో నమః నామస్మరణతో బాసర ఆలయం లో ఆధ్యాత్మిక భావన సంతరించుకుంది.
Tags:Navarathri celebrations will begin in the presence of Basara Amma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *