Navaratna for all deserving poor

Navaratna for all deserving poor

– పెన్షన్లు , రేషన్‌కార్డులపై విచారణ
– మంత్రి పెద్దిరెడ్డి

Date:03/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పార్టీలకతీతంగా అర్హులైన పేద ప్రజలందరికి నవరత్నాలను అందించడమే వైఎస్సార్సీపి ప్రభుత్వ ఆశయమని , ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ , గ్రామీణాభివృద్ధి గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండలంలోని బండ్లపల్లెలో రెండవ రోజు పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పెద్దారెడ్డితో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలల కాలంలో వినూత్న రీతిలో పరిపాలన ప్రారంభించిన ఘనత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. అసెంబ్లిలో ప్రవేశపెట్టిన 19 బిల్లులో 14 బిల్లులు నవరత్నాలకు సంబంధించినవి కావడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో 600 హామిలతో మ్యానిఫెస్టోను ఏర్పాటు చేసి, ఒక్క హామిని కూడ నేరవేర్చకుండ ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపి అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండు పేజిల మ్యానిఫెస్టోను తయారు చేసి, దానిని అన్నిశాఖల అధికారులకు, మంత్రులకు , ఎమ్మెల్యేలకు, ఎంపిలకు అందివ్వడం జరిగిందన్నారు. మ్యానిఫెస్టోను చేతపట్టుకుని అభివృద్ధి , సంక్షేమ పథకాలను అమలు పరిచే కార్యక్రమం రాష్ట్రంలో చేపట్టడం వైఎస్సార్సీపి చరిత్ర సృష్టించడమేనన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల రుణాలు అన్ని పూర్తి స్థాయిలో మాఫి చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల ఏర్పాటు హర్షనీయమన్నారు. 4.11 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తుందన్నారు. అలాగే మార్చినెలాఖరుకు 25 లక్షల మందికి పక్కా గృహాలు నిర్మించే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల కోసమే ఈ ప్రభుత్వం అనే నినాదంతో రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపిలు , అధికారులు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. 2024 ఎన్నికల ప్రచారంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామిలను నేరవేర్చి, వైఎస్సార్సీపి చేతల ప్రభుత్వంగా నిరూపించి, ప్రచారం చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమన్నారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి 30 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశబావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, నాగరాజారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిమాజీ ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, మదనపల్లె పార్టీ కార్యదర్శి నారదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించేందుకే పల్లెబాట

Tags: Navaratna for all deserving poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *